తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. శివకాశి సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదుగురు మహిళలు సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అనేకమంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వకాశి, విరుదునగర్‌లోని సెంగమాలపట్టిలో పటాకుల ఫ్యాక్టరీ ఉంది. ఒక నిర్జన ప్రదేశంలో పటాకుల ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. రోజూలాగే గురువారం కూడా ఫ్యాక్టరీలో పటాకుల తయారీ పనులు సాగుతున్నాయి. కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ముడి సరుకులతో వచ్చి లోడును దించుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇంతలో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో ఉంచిన బాణాసంచా పేలింది. పేలుడు సంభవించిన వెంటనే ఫ్యాక్టరీ లోపల అరుపులు వినిపించాయి. ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో పొగలు, పెద్ద చప్పుడు వినిపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
పేలుడు చాలా తీవ్రంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఎవరూ తప్పించుకునే అవకాశం కూడా లేదన్నారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో గందరగోళం నెలకొంది. పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 7 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…