Fish Festival: తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని(Pudukkottai district) మైలాపూర్‌లో (Mylapore) ప్రతి ఏటా జరిపే చేపలు పట్టె కార్యక్రమాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలో వరికోతలు తరువాత జరిగే ఈ ఫిష్ ఫెస్టివల్ కి చుట్టు పక్కల గ్రామాలనుంచి వేలాదిగా తరలివచ్చారు. ఈ వేడుకలలో గ్రామస్తులందరూ చేపల వేటకు దిగుతారు. ఇలా పట్టుకున్న చేపలను ఇంటికి తీసుకెళ్లి దేవుడికి నైవేద్యం గా పెడతారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామాలలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు ఈ వేడుకలకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.. ఇప్పుడు అధికారుల నుంచి అనుమతులు రావడం తో వేడుకల్లో వందల సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు .ఈ వేడుకలలో ఎవరైనా సరే చేపలను పట్టాల్సిందే. ఎంత ధర చెప్పిన ఈ చేపలను ఎవరు డబ్బులిచ్చి కొనకపోవడం ఈ వేడుకలలో కొసమెరుపు
మరోవైపు విరుదునగర్ జిల్లా కరియాపట్టి సమీపంలోని కంబికుడి గ్రామంలో 1440 ఎకరాల విస్తీర్ణంలో భారీ చేపల పండుగ కోసం వేలాది మంది ప్రజలు పోటీ పడ్డారు. ఇక్కడ చేపలను పెంచడం.. చెరువులో నీరు ఎండిపోయినప్పుడు చేపలను పట్టుకోవడం చాలా కాలంగా వస్తున్న చర్మం. ఆ కోవలో 12 ఏళ్ల తర్వాత మంగళవారం ఉదయం సంప్రదాయ చేపల పండుగ జరిగింది. తొలుత కంబికుడి గ్రామంలోని వజ్వంద అమ్మన్ దేవాలయానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చి శమీకి పూజలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు కుల, మత, వర్గాలకు అతీతంగా 300 మందికి పైగా గ్రామస్తులు మత్స్యకార సంప్రదాయ పండుగను వీక్షించడానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చేపలను పట్టుకున్నారు. చేపల పండుగలో పట్టిన చేపలను ఇంటికి తీసుకెళ్లి శమీ దర్శనం అనంతరం వండుకుని తింటారు. కుల, మతాలకు అతీతంగా వేలాది మంది హాజరైన ఈ చేపల పండుగ శోభను సంతరించుకుంది.
#WATCH | Tamil Nadu: The fishing festival started in Pudukkottai district. (03.05) pic.twitter.com/c9Guy5jl1K
— ANI (@ANI) May 3, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Horoscope Today: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో అన్నింటా విజయమే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..