మందుబాబులకు షాక్‌.. 500 మద్యం దుకాణాల మూసివేత!

|

Jun 22, 2023 | 11:30 AM

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు బుధవారం (జూన్‌ 21) ప్రకటించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం 5,329 రిటైల్ మద్యం షాపుల్లో 500 మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం..

మందుబాబులకు షాక్‌.. 500 మద్యం దుకాణాల మూసివేత!
Liquor Shop
Follow us on

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు బుధవారం (జూన్‌ 21) ప్రకటించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం 5,329 రిటైల్ మద్యం షాపుల్లో 500 మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. తాజా ప్రకటన గురువారం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామన్న డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇన్నాళ్లకు అమలుచేసేందుకు సిద్ధమైంది. ఈడీ అరెస్టుతో ఆసుపత్రి పాలైన మాజీ ఎక్సైజ్ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఏప్రిల్‌లో రాష్ట్ర అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. దీనిలో భాగంగా తొలి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ షాపుల మూసివేత కారణంగా అక్రమ విక్రయాలకు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.

కాగా మూర్చి 31 నాటికి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5329 రిటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో 500 దుకాణాలను తొలివడతలో మూసివేస్తున్నట్టు ఏప్రిల్ 12న మాజీ ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 20న జీవో కూడా జారీ చేశారు. ఈ జీవో ఆధారంగా 500 రిటైల్ మద్యం దుకాణాలను గుర్తించి జూన్ 22 నుండి మూసివేస్తున్నట్లు టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ విశాకన్ తెలిపారు. ‘కొంత ఆలస్యమైనప్పటికీ, స్టాలిన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినదని’ ప్రతిపక్ష నాయకుబు, పీఎంకే అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అన్బుమణి రామదాస్ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.