Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..

|

Jun 26, 2021 | 5:43 PM

Covid-19 Delta variant: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ భయాందోళన

Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..
Delta variant
Follow us on

Covid-19 Delta variant: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ భయాందోళన కలిగిస్తోంది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వైరస్‌ తాజాగా తమిళనాడుకు కూడా పాకింది. ఈ డెల్టా వైరస్‌తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ తెలిపారు. మదురై రోగి మరణించిన తరువాత నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌ సోకిన వారిలో చెన్నైకి చెందిన ఓ నర్సు, కాంచీపురం జిల్లాకు చెందిన మరొకరు కోలుకున్నట్లు మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.

ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు 45 వేల నమూనాలను పరీక్షించగా.. వాటిలో 51 డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్‌కు సంబంధించి మొత్తం కేసుల్లో మహారాష్ట్రలో 22, తమిళనాడుతో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు చొప్పున, అంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులు నమోదైన రాష్ట్రాల్లో కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేయాలని, అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని కేంద్రం శుక్రవారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

Also Read:

These Banks : కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన బ్యాంకులు ఇవే..! ఎస్బీఐ నుంచి మొదలుపెడితే చాలా బ్యాంకులు..?

BJP Meeting in Delhi : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం..