Pamban Bridge: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. అదిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం..!

|

Dec 20, 2024 | 3:17 PM

భారత్‌లో సముద్రంపై నిర్మించిన తొలి వంతెన పంబన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మండపం ప్రధాన భూభాగంతో రామేశ్వరం ఐలండ్ ఏరియాను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై త్వరలోనే రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. గ్రేట్ పాంబన్ వంతెన ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తూ, షెర్జర్ రోలింగ్ స్పాన్‌లు అందంగా కదులుతాయి. క్రూయిజర్‌లు, ఓడలు వెళ్లేలా చేస్తాయి.

Pamban Bridge: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. అదిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం..!
Pamban Bridge
Follow us on

భారతీయ రైల్వే అతి త్వరలో సరికొత్త రికార్డును నమోదు చేయబోతోంది. తమిళనాడులోని రామేశ్వరంలో 2,070 మీ (6,790 అడుగులు) పొడవు గల నిలువు లిఫ్ట్ సీ బ్రిడ్జి పాంబన్ వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న పాంబన్ వంతెనకు సమాంతరంగా నిర్మించిన ఈ బ్రిడ్జి భారతదేశపు మొదటి సముద్ర వంతెన కాబోతుంది. ఇది సముద్రం మీదుగా 100 స్పాన్‌లను కలిగి ఉంది. అందులో 99 స్పాన్‌లు 18-3 మీటర్లు, ఒక స్పాన్ 72-5 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ.550 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

బంగాళాఖాతంలో నావిగేషన్ ఛానల్‌లో లిఫ్ట్ స్పాన్ గిర్డర్‌ను ఏర్పాటు చేసే పని పూర్తయింది. ఆగస్టు 31 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిని బలోపేతం చేసిన తర్వాత, వంద సంవత్సరాల పురాతనమైన పాంబన్ రైల్వే వంతెనపై లైట్ ఇంజిన్‌ను పరీక్షించారు. బ్రిడ్జిని పటిష్ట పరిచే పనినిలో భాగంగా రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 23, 2022న ట్రాఫిక్‌కు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో దక్షిణ రైల్వే కొత్త పాంబన్ వంతెనపై 12 జూలై 2024న 428 మీటర్లలో 200 మీ దూరం లైట్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. ఇది వంతెన నిర్మాణ సమగ్రత మరియు విశ్వసనీయతను నిర్ధారించింది. ఇక మండపం చివర నుండి 1-50 కి.మీ వరకు ట్రాక్ అనుసంధానించి, గూడ్స్ రైళ్ల ట్రయల్ మూమెంట్ పూర్తయింది. మిగిలిన 0-60 కి.మీ అప్రోచ్ స్పాన్ ప్రారంభంతో ట్రాక్ పూర్తి అయ్యింది.

ఇది తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్‌ బ్రిడ్జ్. బ్రిడ్జ్‌ అంటే మామూలు బ్రిడ్జ్‌ కాదు.. దేశంలోనే ఫస్ట్‌ వర్టికల్ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్లనాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్‌ బ్రిడ్జ్‌ తుప్పుపట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో.. దాని సమీపంలోనే ఈ న్యూ పంబన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టారు. లేటెస్ట్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. వావ్‌ అనిపించే ఈ దృశ్యాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలలపై ఇంజనీరింగ్‌ అదరహో అంటూ కొనియాడారు. పాత, కొత్త పంబన్‌ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీలోనే కాదు స్పీడ్‌లోనూ అదరగొడుతుందంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య ఫిబ్రవరి 24, 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతో పూర్తైంది. 2.6 కి.మీ పొడవైన వంతెనను 2006లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019 మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..