Tamil Nadu Minister Sekar Babu: తమిళనాడులో రాజాకీయాలు మారుతున్న వేళ.. ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితుడు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఉత్తరాది భారతీయులపై పలు వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. డీఎంకే పార్టీ వల్లనే తమిళనాడులోని ఉత్తర భారతీయులు ధనవంతులు అవుతున్నారని, అయితే ఎన్నికల్లో మాత్రం మాకు ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేశారంటూ మంత్రి శేఖర్ బాబు పేర్కొన్నారు. . ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, కానీ ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చంటూ ఆయన చెప్పారు. ఉత్తరాది వారు మాకు ఓటు వేయలేదు.. బీజేపీకే వేశారు. అయినా మీరు మాకే ఓటు వేశారని.. అంటూ మోసం చేస్తున్నారని శేఖర్ బాబు పేర్కొన్నారు.
బుధవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన శేఖర్ బాబు మాట్లాడుతూ.. తమిళనాడులో నివసిస్తున్న ఉత్తర భారతీయులు డీఎంకే ప్రయత్నాల వల్ల సంపాదించి ధనవంతులు అయ్యారని పేర్కొన్నారు. అయితే వారు ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేశారన్నారు. ఇప్పడే కాదు వారు 2011 నుంచి ఇప్పటివరకు మన పార్టీకి ఓటేయడం లేదంటూ అభిప్రాయపడ్డారు. మనకు ఓటేయనప్పటికీ వారికి సహాయపడండి.. వారు అపరాధభావంతో సిగ్గుపడేలా చేయండి అంటూ డీఎంకే పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారు ఎప్పటికైనా తమ తప్పులను గ్రహించి సిగ్గుపడతారంటూ పేర్కొన్నారు.
Also Read: