Automatic Traffic Challan: వాహనదారులకు అలర్ట్..! స్పీడ్ దాటిందో ఆటోమ్యాటిక్‌ చలాన్లు..

|

Jun 22, 2023 | 12:05 PM

సిటీల్లోని రోడ్లపై పగటిపూట గంటకు 40 కిమీ కంటే అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ఇకపై కుదరదు. అటువంటి వారికి కళ్లెం వేసేందుకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (GCTP) ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ పెనాల్టీ చలాన్లను అమల్లోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు...

Automatic Traffic Challan: వాహనదారులకు అలర్ట్..! స్పీడ్ దాటిందో ఆటోమ్యాటిక్‌ చలాన్లు..
Speed ​​radars In Chennai
Follow us on

చెన్నై: సిటీల్లోని రోడ్లపై పగటిపూట గంటకు 40 కిమీ కంటే అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ఇకపై కుదరదు. అటువంటి వారికి కళ్లెం వేసేందుకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (GCTP) ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ పెనాల్టీ చలాన్లను అమల్లోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఇష్టారీతిగా వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు 30 స్పీడ్ రాడార్ గన్‌లను ఏర్పాటు చేయనున్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పది స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేశారు. తాజా నిబంధనల ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనదారులు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతోనూ, రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతోనూ వాహనం నడపకూడదు. దేశంలో తొలిసారి ఇటువంటి సాంకేతిక విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తోgది.

పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ మాట్లాడుతూ.. అతివేగాన్ని అరికట్టడం సవాలుతో కూడుకొన్న విషయం. కొందరు రోడ్లపై స్టంట్స్‌ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతుంటారు. అతివేగం కారణంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంత మంది తమ తీరును మార్చుకోవడం లేదు. ఇకపై అధిక స్పీడ్‌తో ప్రయాణించే వాహనదారులకు ఆటోమేటిక్‌గా ఫైన్ పడిపోతుంది. రాడార్ గన్స్ ఆటోమెటిక్‌గా చలాన్లు విధిస్తాయని పోలీస్ కమిషనర్ జంకర్ జైవాల్ అన్నారు. ఐతే వాహనాన్ని బట్టి వేగ పరిమితిలో మార్పులుంటాయి. ఆటోరిక్షాలైతే గంటకు 25 కి.మీ మించకూడదు. ప్రస్తుతం తేనాంపేటలోని అన్నా అరివాళం జంక్షన్, విమానాశ్రయం వద్ద డాక్టర్ గురుసామి వంతెన, పుల్లా అవెన్యూ, మధురవాయల్‌లోని రేషన్ షాప్ జంక్షన్, ప్యారీస్ కార్నర్ జంక్షన్, ఇంజంబాక్కం, స్పెన్సర్ ప్లాజా, ఆలందూరు వంటి పది ప్రదేశాల్లో స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో మరో 20 చోట్ల దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.