Vijay: 118 మంది కావాల్సిందే.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని అనుమతి..

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు గవర్నర్‌ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్‌. అయితే గవర్నర్‌ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

Vijay: 118 మంది కావాల్సిందే.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని అనుమతి..
Vijay

Updated on: May 06, 2026 | 5:46 PM

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌ సన్నాహాలు ప్రారంభించారు. ఈమేరకు తమిళనాడు గవర్నర్‌ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్‌. అయితే గవర్నర్‌ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

అయితే, కాంగ్రెస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్‌ అనుమతి లభించలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం విజయ్‌కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది.. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆయన పార్టీ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), 118 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడానికి కనీసం 10 సీట్లు అవసరం.. కాంగ్రెస్ ఐదు సీట్లతో, ఆ సంఖ్య 113కి పెరిగింది.. ఇంకా ఐదుగురు సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. కాంగ్రెస్ కాకుండా, స్వతంత్రులతో సహా విజయ్ బృందంలోకి ఇంకా ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇతర కీలక డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ (రెండు సీట్లు), సీపీఎం (రెండు సీట్లు), వీసీకే (రెండు సీట్లు)ల మద్దతుపైనే టీవీకే ఆశలు పెట్టుకుంది.  ఈ క్రమంలో లెఫ్ట్ పార్టీలు కీలక ప్రకటన చేశాయి..

విజయ్ కి షాకిస్తూ.. వామ పక్షాలు ప్రకటన విడుదల చేశాయి.. విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. డీఎంకే కూటమి లోనే కొనసాగుతామని వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి ఉన్న మెజారిటీని విజయ్ నిరూపించుకోవడమే తదుపరి దశ అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us