వాట్సాప్‌లోని పసుపు, నారింజ, బ్లూ ..ఈ హార్ట్ ఎమోజీస్ అర్థం తెలుసా?

Samatha

24 August 2026

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ నిరంతరం రీల్స్ చూస్తూ, తమ స్నేహితులతో చాట్  చేసుకుంటూ ఉంటారు.

ఇక చాలా మంది తమ మనసులోని భావాలను వ్యక్త పరచడానికి ఎమోజీస్ పంపుతారు. అయితే చాట్ చేసే సమయంలో అనేక రంగు రంగుల హార్ట్ ఎమోజీస్ ఉంటున్నాయి.కాగా, ఇప్పుడు మనం ప్రతి హార్ట్ ఎమోజీకి సంబంధించిన అర్థాలను తెలుసుకుందాం.

ఎరుపు రంగు .. ఎరుపు రంగు హార్ట్ ఎమోజీ, ఇది ప్రేమ , అనుబంధం, ఎదుటి వారితో జీవితం పంచుకోవాలనే కోరికను తెలియజేస్తుంది.

పసుపు రంగు.. ఇది స్నేహానికి సంకేతం. సంతోషకరమైన భావాలను , తమ స్నేహాన్ని తెలియజేయడానికి ఈ పసుపు రంగు ఎమోజీ వాడుతూ ఉంటారు.

గులాబీ రంగు.. ఇది ప్రేమ శ్రద్ధ, ఆప్యాయతలను తెలియ జేస్తుంది. ఇది ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై చూపించే, శ్రద్ధను, చూపిస్తారు. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తారు.

నీలి రంగు.. ఇది కేవలం నమ్మకం, విధేయతకు సంబంధించినది, నీను నీకు అండగా ఉండటానికి, ఈ బ్లూ హార్ట్ సింబల్ ఉపయోగిస్తారు.

పర్పుల్ కలర్ హార్ట్ సింబల్.. ఇది గౌరవం, అవగాహన, నమ్మకానికి సంబంధించినది. ఇది ప్రేమకు చిహ్నం అయినప్పటికీ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది.

ఆరెంజ్ కలర్ హార్ట్ ఎమోజీ.. ఇది స్నేహానికి సంబంధించినది, నువ్వు నాకు చాలా దగ్గర అని ప్రేమ కంటే స్నేహం ఎక్కువ అనే దానిని సూచిస్తుంది.