మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలు పలు నియమ నిబంధనలు పాటిస్తాయనే విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాలతో పాటు కొన్ని ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరంగా పరిగణిస్తారు. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమిళనాడులో కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాల్స్, బాంకెట్, మ్యారేజ్ హాల్స్‌తో పాటు స్పోర్ట్స్ స్టేడియాలలో కూడా మద్యం సేవించే అనుమతులు ఇచ్చింది.
అయితే ఇందుకోసం ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తమిళనాడు మద్యం (లైసెన్స్ అండ్ పర్మిట్) రూల్, 1981కి సవరణలు చేసింది. అంతర్జాతీయ, జాతీయ శిఖరాగ్ర సమావేశాలతో పాటు పలు సమావేశాలు, వేడుకలు, పండుగల్లో అతిధులు, సందర్శకులకు మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్సింగ్ నిబంధనను ప్రవేశపెట్టింది.
ఛార్జీల విషయానికొస్తే.. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరిధిలో 75,000 రూపాయలు, మున్సిపాలిటీ సమీప ప్రాంతాలకు 50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఇంత మెత్తం చెల్లించాలి. కాగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో రోజుకు 11,000 రూపాయలు, మునిసిపాలిటీ పరిధిలో 7,500 రూపాయలు, ఇతర ప్రదేశాలకు 5,000 రూపాయలు చెల్లించి లైసెన్స్ తీసుకోవచ్చు.
Tamil Nadu government has brought a special license for allowing the serving of liquor in conference halls, convention centres, marriage halls, banquet halls, sports stadiums and household functions pic.twitter.com/JS0MePPfx3
— ANI (@ANI) April 24, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..