Tamil Nadu Politics: దివంగత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తమిళనాట ఇలా అడుగు పెట్టారో లేదో.. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మరో గట్టి షాక్ ఇచ్చింది. వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వం జప్తు చేసింది.
తాజాగా జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరణ్ పేరుతో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇటీవలె చెన్నైలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి శశికళకు షాక్ ఇచ్చింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును పళని స్వామి సర్కార్ ఇప్పుడు అమలు చేస్తోంది.
ఇదిలాఉంటే.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం సోమవారం నాడు తమిళనాడులో అడుగుపెట్టిన శశికళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే వారుసురాలినని అంటూ సంచలన ప్రకటన చేశారు. దాంతోపాటు అన్నాడీఎంకేలోని కోట్లాదిమంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో తమిళనాట పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది.
Also read: