తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కళ్లముందే ఓ ఏనుగు విద్యుత్‌షాక్‌తో మృతి చెందింది. ధర్మపురి జిల్లాలో సమీప ఆడవుల్లో నంచి దారి తప్పిన ఓ ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది. ఇది గమనించిన స్థానికులు ఏనుగును విద్యుత్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి అందరు చూస్తుండగానే ఏనుగు విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారణాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..