AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVK Vijay: విజిల్‌ రీసౌండ్‌కు లెక్కలన్నీ తారుమారు.. దళపతి విజయ్‌ గెలుపునకు కలిసొచ్చిన అంశాలివే..

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ టీవీకే జెండా పాతింది. అధికార డీఎంకే ఘోర పరాజయం పాలైంది. కరూర్‌ తొక్కిసలాట, సీబీఐ కేసు, వైవాహిక వివాదాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, విజయ్ తన స్టార్‌డమ్‌, వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్నారు. యువతలో ఆయనకున్న ఇమేజ్, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, "విజిల్" గుర్తు టీవీకే విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

TVK Vijay: విజిల్‌ రీసౌండ్‌కు లెక్కలన్నీ తారుమారు.. దళపతి విజయ్‌ గెలుపునకు కలిసొచ్చిన అంశాలివే..
Vijay
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2026 | 12:58 PM

Share

తమిళనాడులో టీవీకే జెండా పాతింది. విజయ్‌ విజిల్‌ స్టేట్‌మొత్తం వినిపిస్తోంది. అధికార డీఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది తమిళగ వేట్రి కళగం. అదే సమయంలో అన్నాడీఎంకే, బీజేపీ కలిసిన NDA కూటమి కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. టీవీకే తర్వాతి స్థానంలో ఉంది NDA కూటమి. ఈ కూటమిలో అన్నాడీఎంకే అభ్యర్థులే లీడింగ్‌లో ఉండగా.. ఒకే ఒక్క స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక అధికార డీఎంకే కూటమికి ఇది ఘోర పరాభవమే. దాదాపు వంద స్థానాలకు పైగా కోల్పోతోంది అధికార పార్టీ. అయితే తమిళనాడులో క్లియర్‌ మెజార్టీ రాకున్నా.. టీవీకే ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాని.. ఎవరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నదే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌.

విజయ్‌ విజయం అంత ఈజీగా వచ్చిందా అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే విజయ్‌ పార్టీ పెట్టిన దగ్గర్నుంచి ఎంత అభిమానాన్ని, మద్దతును, జనాదరణను సాధిస్తూ వచ్చారో.. అదే సమయంలో కష్టాలూ వెంటాడాయి. ఆయన ప్రచారం వినూత్నంగా ఎంచుకున్నారు. ఫ్యాన్స్‌తోనే కలిసి నడిచారు. అయితే కరూర్‌ ర్యాలీలో జరిగిన ఘోరం ఆయనను కుంగదీసింది. దాదాపు రెండు నెలల పాటు విజయ్‌ బయటకు రాలేదు. కరూర్‌ తొక్కిసలాటలో 40మందికి పైగా చనిపోవడం దేశవ్యాప్త చర్చగా మారింది. అంతేకాదు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడం.. ఢిల్లీలో విచారణకు కూడా హాజరయ్యారు. అదే సమయంలో విజయ్‌ భార్య విడాకులు ప్రకటించి షాక్‌ ఇచ్చింది. అంతకు ముందు విజయ్‌ త్రిష మధ్య అఫైర్‌ నడుస్తోందని డీఎంకే నేతలు ప్రచారం చేయడం.. అప్పుడు విజయ్‌ భార్య విడాకులు ప్రకటించడం.. త్రిషతో కలిసి విజయ్‌ పెళ్లికి అటెండ్‌ అవడం చాలా వివాదాన్నే సృష్టించింది. ఇక విజయ్‌ నటించిన జననాయగన్‌ సినిమాలోనూ అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. ఆయన సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వకపోవడం ఇప్పటికీ విడుదల కాలేదు. ఇలా విజయ్‌ చుట్టూ ఇలా వివాదాలు, కేసులు నడిచినా.. ఆయన మాత్రం వెనుకంజ వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని నిర్వహించారు. విజిల్స్‌ వేస్తూ.. సైకిల్‌ తొక్కుతూ.. పంచ్‌ డైలాగ్స్‌ పేలుస్తూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ఆ జోష్‌ మొత్తం ఓట్లుగా టర్న్‌ అయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో క్లియర్‌గా అది కనిపిస్తోంది.

విజయ్‌కు ప్లస్‌ పాయింట్స్‌

1. స్టార్‌డమ్‌

2. యువతలో మంచి ఇమేజ్‌

3. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం

4. ఉత్సాహంగా, వినూత్నంగా ప్రచారం

5. ఆకట్టుకునేలా ప్రసంగాలు

6. వివాదాలు, కేసులతో ప్రజల్లో సానుభూతి

7. టీవీకే పార్టీ గుర్తు (విజిల్‌)

8. ఒంటరిగా పోటీ

9. మేనిఫెస్టో ముఖ్యభూమిక

కలవని రాహుల్‌, స్టాలిన్‌.. అధికార డీఎంకే ఓటమికి చాలా కారణాలు..

ఇవన్నీ విజయ్‌ విక్టరీకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే అధికార డీఎంకే ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ముందు నుంచి వెల్ఫేర్‌పై దృష్టిపెట్టిన డీఎంకే పార్టీ.. ఫలితాల్లో ఘోర ఓటమిని చవిచూడక తప్పలేదు. డీఎంకేపై అవినీతి ఆరోపణలు రావడం.. దీనిపై ప్రతిపక్షాలు విస్తృత ప్రచారం చేశాయి. ఈ ప్రచారం పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక స్టాలిన్‌ కాంగ్రెస్‌ పొత్తు బెడిసికొట్టింది. ఈ పొత్తులో గొడవల వల్ల సీట్ల కేటాయింపులో చివరి వరకు జాప్యం జరిగింది. తమకు అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో చివరి రోజు వరకు క్లారిటీ లేదు.

ఇక.. రాహుల్‌, స్టాలిన్‌ కలిసి ప్రచారం చేయకపోవడం. కాంగ్రెస్‌ నేతలను బలవంతంగా డీఎంకే అధినేత కొన్నారంటూ టీవీకే ప్రచారం చేసింది. నిజమైన కాంగ్రెస్‌ మాకే మద్దతు అంటూ విజయ్‌ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోపైనా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us