ప్రియుడి ముందే యువతి పై గ్యాంగ్ రేప్.. కాలేజీ ఆవరణలోనే దారుణం..

|

Jan 14, 2023 | 5:46 PM

వారంతా మద్యం మత్తులో మాస్క్‌లు ధరించి ఉన్నారని బాధితురాలు చెప్పింది. అందువల్లే వారి ముఖాలను గుర్తించలేకపోయానని చెప్పింది.

ప్రియుడి ముందే యువతి పై గ్యాంగ్ రేప్.. కాలేజీ ఆవరణలోనే దారుణం..
Follow us on

యావత్‌ దేశం సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయి ఉండగా, తమిళనాడు కాంచీపురంలో మాత్రం దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు-పుదుచ్చేరి హైవే సమీపంలోని తమిళనాడులోని కాంచీపురంలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై దుండగులు సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడి ముందే ఐదుగురు వ్యక్తులు యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో యువతి, ఆమె ప్రియుడు కలిసి మాట్లాడుకుంటుండగా,.. ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో బెదిరించారు. ప్రియుడిని బంధించిన దుండగులు..ఒక్కొక్కరుగా యువతిపై దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసుల ఎదుట విలపిస్తూ చెప్పింది.

యువతి గట్టిగా కేకలు వేయడంతో గొడవ చేస్తే అక్కడికక్కడే చంపి పాతిపెడతామని బెదిరించారు దుండగులు. దీంతో ఆమె ప్రియుడు కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడ్డాడు. దాడి అనంతరం బాధిత యువతి తన స్నేహితుడు..అక్కడ్నుంచి బంధువుల ఇంటికి వెళ్లారు. యువతిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు.

కాలేజీ ఆవరణలో చీకటిగా ఉండడంతో దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించలేకపోయామని పోలీసులకు తెలిపారు.అయితే నిందితుల్లో ఒకరి పేరు విమల్ అని యువతికి తెలిసింది. వారంతా మద్యం మత్తులో మాస్క్‌లు ధరించి ఉన్నారని బాధితురాలు చెప్పింది. అందువల్లే వారి ముఖాలను గుర్తించలేకపోయానని చెప్పింది.

ఇవి కూడా చదవండి

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. విపాడు గ్రామంలో పోలీసులు విమల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విమల్ ద్వారా తమిళనాడు పోలీసులు మిగతా నలుగురిని మణికందన్, శివకుమార్, విఘ్నేష్, తెన్నరసుగా గుర్తించారు. ఈ ఐదుగురు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..