Chennai Floods: తమిళనాడులోని పలు పాత్రలతో పాటు రాజధాని చెన్నై సహా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద బాధితులకు సహాయం చేస్తూ.. విధులను నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీసు స్మశాన వాటిలో అపస్మారక స్థితిలో ఉన్న ఉదయ్ కుమార్ అనే 25ఏళ్ల యువకుడిని గుర్తించి భుజం మీద వేసుకుని ఎంతో కష్టంమీద చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. రాజేశ్వరి సాహసోపేతమైన చర్యకు గాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం రాజేశ్వరిని సత్కరించారు. విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన రాజేశ్వరిని సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా అభినందించారు.
గురువారం టీపీ చత్తిరం ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఉదయను రక్షించారు. రాజేశ్వరికి స్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి కాల్ వచ్చింది. ఆ వ్యక్తిని రక్షించాలనే తపనతో రాజేశ్వరి అక్కడికి హుటాహుటిన వెళ్ళింది. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓ చెట్టు అతనిపై పడింది. అయితే బాధితుడిని రక్షించాలని ప్రయత్నంలో భాగంగా రాజేశ్వరి ఉదయ్ ని భుజం మీద వేసుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది. అయితే కిల్‌పాక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉదయ్ కుమార్ ఈరోజు ఉదయం మరణించాడు.
TP Chatram Police Station’s inspector Rajeshwari carries an unconscious man on her shoulders to an autorickshaw in a bid to rush him to a nearby hospital. #ChennaiRains2021 pic.twitter.com/9bhJE6TUz6
— TOIChennai (@TOIChennai) November 11, 2021
Also Read : యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే.. అలాగే చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్ డాన్స్.. వీడియో వైరల్
ఆఫ్ఘనిస్థాన్ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..