Assembly on CAA: సీఏఏ రద్దు చేయాలి.. తీర్మానం చేసిన తమిళనాడు శాసనసభ

|

Sep 08, 2021 | 3:45 PM

తమిళనాడు శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు.

Assembly on CAA: సీఏఏ రద్దు చేయాలి.. తీర్మానం చేసిన తమిళనాడు శాసనసభ
Tamil Nadu Cm Mk Stalin
Follow us on

Tamil Nadu Assembly on CAA: తమిళనాడు శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. 2019లో పార్లమెంటు ఆమోదించిన సిటిజన్‌షిప్ సవరణ చట్టం రాజ్యాంగంలో పేర్కొన్న సెక్యులర్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేదన్నారు. దేశంలోని మత సామరస్యానికి ఏమాత్రం దోహదకారి కాదని తమిళనాడు శాసనసభ అభిప్రాయపడుతోందన్నారు.

దేశంలోని ఐక్యత, మతసామరస్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగం పేర్కొన్న సెక్యులర్ సిద్ధాంతాలను పరిరక్షించేందుకు సీఏఏను రద్దు చేయాలని అసెంబ్లీ కోరుతున్నట్టు పేర్కొన్నారు. వేధింపులకు గురైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, బుధ్ధ, పార్సీ, క్రిష్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ అనుమతిస్తోంది. సీఏఏ అమలును విపక్ష పార్టీలు, వివిధ సంస్థలు వ్యతిరేకిస్తున్నారు.

Read Also…  Telegram Feature: సెట్ చేసుకున్న సమయానికి మెసేజ్.. టెలిగ్రామ్‌లో ఉన్న ఈ క్రేజీ ఫీచర్‌ మీకు తెలుసా?

Nipah Virus: నిఫా అంటేనే ఎందుకు హడలిపోతున్నారు? తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందా.! అసలు దీని కథేంటి.?