Tamilnadu CM Stalin: మరో కొత్త పథకానికి స్టాలిన్ శ్రీకారం.. రోడ్డు ప్రమాద బాధితులకు 48 గంటలు ఉచిత చికిత్స..

|

Dec 19, 2021 | 9:21 AM

Tamilnadu CM Stalin: ఎం కె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ...

Tamilnadu CM Stalin: మరో కొత్త పథకానికి స్టాలిన్ శ్రీకారం.. రోడ్డు ప్రమాద బాధితులకు 48 గంటలు ఉచిత చికిత్స..
Tamilnadu Cm
Follow us on

Tamilnadu CM Stalin: ఎం కె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ… రోజు రోజుకీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు.  కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎం స్టాలిన్ నేచర్ కు ప్రతిపక్షాల నేతలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తమిళనాడులో రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను  రక్షించాలన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని ప్రవేశ పెట్టారు. రోడ్డుప్రడంలో గాయపడినవారు  ప్రాణాలను కాపాడుదాం (ఇన్నుయిర్‌ కాప్పోమ్‌) అనే పేరుతో మరో కొత్త పథకానికి తెరతీశారు. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం గాయపడిన వారికీ మొదట మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించడమే. ఈ పథకాన్ని చెంగల్‌పట్టు జిల్లా మేల్‌ మరువత్తూర్‌ లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో సీఎం స్టాలిన్‌ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇన్నుయిర్‌ కాప్పోమ్‌ నమైకాక్కుమ్‌48 పథకంలో భాగంగా.. ప్రమాదం జరిగిన వ్యక్తి.. ప్రాణాన్ని కాపాడేందుకు మెుదటి 48 గంటల్లో అయ్యే అవసరమైన వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకంలో భాగంగా బాధితునికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు అందించనుంది. ఈ పథకంలో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) లబ్ధిదారులు, సభ్యులు కానివారు అర్హులే.  బాధితులకు 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేటు ఆస్పత్రులు సహా 610 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, ప్రధాన రహదారుల్లోని ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నా క్షతగాత్రులను వెంటనే చేర్పించి కాపాడేందుకు వీలుగా ప్రణాళిక చేశారు.

తమిళనాడులో రోడ్డు ఎవరైనా ప్రమాదానికి గురైతే.. పథకంలో భాగంగా మెుదటి 48 గంటల పాటు ఉచిత వైద్యం ప్రభుత్వం అందిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ మెుదటి 48 గంటలు ముఖ్యమని.. అందుకోసమే.. పథకాన్ని ప్రారంభించినట్టు స్టాలిన్ అన్నారు. ఆసుపత్రిలో చేరే బాధితుడు కోలుకున్న తర్వాత తనకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకోవాలనుకునే సందర్భంలో ఆరోగ్య బీమా  లేదా స్వీయ చెల్లింపును ఎంచుకోవాల్సి ఉంటుంది.  మల్మరువత్తూరులో పథకాన్ని ప్రారంభించిన తర్వాత, ముఖ్యమంత్రి స్టాలిన్ నందివరంలో మెగా కోవిడ్-19 టీకా శిబిరాన్ని పరిశీలించారు.

Also Read:  పుష్ప రెండు ఓటీటీల్లో విడుదల.. డిజిటల్‌లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..