Tamil Nadu: తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగటం లేదు.. వరుస సూసైడ్ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు వారాల్లో ఐదు ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తమిళనాడులోని శివగంగా నగర్‌కు చెందిన 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తన ఇంట్లో శవమై కనిపించాడు. అతని పక్కన ఓ సూసైడ్ లేఖ పోలీసులకు లభించింది. తనకు చదువు సరిగ్గా ఎక్కడం లేదని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మంగళవారం శివకాశి సమీపంలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రులు కన్నన్, మీనా క్రాకర్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలిక తమ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే బాలిక మృతికి గల కారణాలు తెలియరాలేదు.
TN | A class 12 student hanged himself at his home near Karaikudi in Sivagangai dist. A case has been registered and we’re investigating. His autopsy was completed. The body was handed over to his parents: Karaikudi DSP Vinoj
ఇవి కూడా చదవండిThis is fifth such instance in the state this month
— ANI (@ANI) July 27, 2022
అంతకు ముందే జులై25న 12వ తరగతి చదువుతున్న బాలిక కడలూరులోని తన ఇంట్లో శవమై కనిపించింది. తల్లి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అదే రోజు తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న మరో బాలిక తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ముగ్గురు 12వ తరగతి విద్యార్థులే కావడం గమనార్హం. క్రితం రోజు కడలూరులో మరో 12వ తరగతి విద్యార్థి మరణించిన సంగతి విదితమే. తల్లిదండ్రులు తనను ఐఏఎస్ చేయాలనుకున్న ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాననంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి