KT Raghavan Video: తమిళనాడులో బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ వ్యవహారం తీవ్ర దుమారంరేపుతోంది. పార్టీ సభ్యురాలితో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ అసభ్యకర చాటింగ్ వీడియో యూట్యూబ్‌లో ప్రత్యక్షమైయ్యింది. పార్టీ సభ్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేటీ రాఘవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఫిర్యాదు చేశారు. తీవ్ర రాజకీయ దుమారం నేపథ్యంలో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి కేటీ రాఘవన్ రాజీనామా చేశారు. గత ఏడాది బీజేపీలో చేరిన యూట్యూబర్ మదన్ రవిచంద్రన్ తన యూట్యూబ్ ఛానల్(మదన్ డైరీ)లో దాదాపు 20 నిమిషాల నిడివిగల ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కే అన్నామలై ఆదేశాల మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అన్నామలైతో భేటీ తర్వాత ట్విట్టర్‌లో తన రాజీనామా నిర్ణయాన్ని రవిచంద్రన్ ప్రకటించారు. తనతో పాటు పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ వీడియోను విడుదల చేశారని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని, చివరకి ధర్మం గెలుస్తుందని న్యాయవాది అయిన రవిచంద్రన్ వ్యాఖ్యలు చేశారు. తాను ఏంటో తన సన్నిహితులు, తమిళనాడు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పార్టీ నేతలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు తాను ఈ వీడియో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.
తమిళనాట పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీకి ఈ వీడియో చాటింగ్ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.
“How to worship God properly?” ft. KTRaghavan.mp4
pic.twitter.com/Qvz6IyBdT8— ????? ???? (@Fan_Of_RDJ) August 24, 2021
Also Read..
సైలెంట్‌గా పక్షిని వేటాడి మింగేసిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
రుచికరమైన పాలకు 12 శాతం జీఎస్టీ.. లస్సీ..బటర్ మిల్క్‌లకు జీఎస్టీ లేదు..ఎందుకలా తెలుసుకోండి!