Tamil Nadu: చెన్నైలో ఘోరం.. తెలిసినవాడే కదా అని నమ్మి కారెక్కిన యువతి.. కట్ చేస్తే నడిరోడ్డుపై..

Chennai Gang Rape: చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. నగర శివార్లలో యువతి ఫై గ్యాంగ్ రేప్ జరిగింది. యవతిని బెదిరించి, మద్యం తాగించి..

Tamil Nadu: చెన్నైలో ఘోరం.. తెలిసినవాడే కదా అని నమ్మి కారెక్కిన యువతి.. కట్ చేస్తే నడిరోడ్డుపై..
Gang Rape
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:34 AM

Chennai Gang Rape: చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. నగర శివార్లలో యువతి ఫై గ్యాంగ్ రేప్ జరిగింది. యవతిని బెదిరించి, మద్యం తాగించి అత్యాచారం చేశారు ముగ్గురు కీచకులు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఓ న్యాయవాది సహా ఇద్దరు నిందితులు పరారయ్యారు.

వివరాల్లోకెళితే.. చెంగల్‌పట్టుకి చెందిన యువతి, చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తోంది. స్థానికంగా ఉంటున్న శరవణన్‌ అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. ఎప్పటిలానే విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా యువతిని కారులో తీసుకెళ్లాడు శరవణన్. కారులో బలవంతంగా మద్యం తాగించి.. స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శరవణన్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారిలో ఉన్న సూర్య ప్రకాష్, సంజయ్‌ల కోసం గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..