Nithyananda: నేను బతికే ఉన్నా.. మరోసారి వివాదాస్పద స్వామి నిత్యానంద కీలక ప్రకటన

తాను చనిపోయినట్టు కొందరు సోషల్‌మీడియాలో పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు నిత్య వివాదాల స్వామి నిత్యానంద. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు.

Nithyananda: నేను బతికే ఉన్నా.. మరోసారి వివాదాస్పద స్వామి నిత్యానంద కీలక ప్రకటన
Swamy Nithyananda

Updated on: Jul 25, 2022 | 1:39 PM

Swami Nithyananda: వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తాను చనిపోయినట్టు కొందరు సోషల్‌ మీడియాలో పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని నిత్య వివాదాల స్వామి నిత్యానంద పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. నాలుగు నెలల నుంచి తాను చనిపోయినట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయని తెలిపారు. తన వయస్సు 44 సంవత్సరాలని.. నేను ఈ నాలుగు నెలల వ్యవధిలో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. దేవుడి తనకిచ్చిన మరో జన్మలో తాను చేసే పనులు ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. తాను జనం కోసం చేస్తున్న మంచి పనులను ఎవరూ చేయలేరన్నారు. హిందువుల పరిరక్షణ కోసం మైక్రో ఫైనాన్స్ విధానం తీసుకొస్తున్నట్టు నిత్యానంద తెలిపారు. లక్ష రూపాయిల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామంటూ నిత్యానంద సెన్సెషనల్ కామెంట్ చేశారు.

అన్నిదేశాలలో కలిపి 10 లక్షల శివాలయాలు నిర్మిస్తామని స్వామి నిత్యానంద ప్రకటించారు. నిత్యానంద ఆర్మీలో చేరాలని యువతకి పిలుపునిచ్చారు. 10 లక్షల మందితో నిత్యానంద సేనని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంచేసినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us