బ్రేకింగ్: సుష్మాస్వరాజ్ కన్నుమూత!
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగానే […]
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగానే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయని సంగతి తెలిసిందే.