Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించాలని జస్టిస్ నాగారాత్న ప్రశ్నించారు. విద్యా, ఆర్థిక సాధికారత సామాజిక ఉన్నతికి దారితీస్తుందన్నారు. అందువల్ల, పిల్లలకు రిజర్వేషన్లు కోరడం ఎప్పటికీ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇది మనం దృష్టి..

Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court

Updated on: May 22, 2026 | 4:28 PM

Supreme Court: OBC కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు IAS అయితే రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్ధికంగా సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది. ఓబీసీ క్రీమిలేయర్‌కు EWS కోటాకు తేడా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కిందిస్థాయి వారికే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది.

కింది స్థాయి వారికీ రిజర్వేషన్లు అందాలని, ఒకే కుటుంబం అవకాశాలను దక్కించుకుంటే.. అదే వర్గంలోని వెనుకబడిన పేదలకు అన్యాయం జరగదా? అని ప్రశ్నించింది కోర్టు. ఈ అంశాన్ని తీవ్రంగా పరగణించాలని, కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ నాగారాత్న EWS వర్గాన్ని ప్రస్తావిస్తూ.. EWS వర్గానికి సామాజిక వెనుకబాటుతనం లేదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉందన్నారు. అందువల్ల, EWS వర్గం కంటే క్రీమీ లేయర్ వర్గానికి ప్రమాణాలు మరింత సరళంగా ఉండాలని, ఇద్దరినీ సమానంగా చూస్తే, ఎలాంటి తేడా ఉండదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us