Manipur Violence: మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు రావాలంటే వారిదే బాధ్యత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

|

Jul 10, 2023 | 2:43 PM

మణిపుర్‌లో గత రెండు నెలలకు పైగా కొనసాగుతన్న హింస ఇంకా చల్లారడం లేదు. పలు చోట్ల ఇప్పటికీ ఉద్రిక్తత వాతావరణం ఉండటంతో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అయితే మణిపుర్ అల్లర్లపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Manipur Violence: మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు రావాలంటే వారిదే బాధ్యత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court Of India
Follow us on

మణిపుర్‌లో గత రెండు నెలలకు పైగా కొనసాగుతన్న హింస ఇంకా చల్లారడం లేదు. పలు చోట్ల ఇప్పటికీ ఉద్రిక్తత వాతావరణం ఉండటంతో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అయితే మణిపుర్ అల్లర్లపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మణిపుర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల్ని పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదని తెలిపింది. అలాగే అక్కడ జరుగుతున్న హింసను అరికట్టేందుకు శాంతి భద్రతలకు తమ చేతుల్లోకి తీసుకోవడం కుదరదని వెల్లడించింది. మణిపుర్‌లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులను మాత్రమే ఆదేశించగలమని స్పష్టం చేసింది.

ఆ రాష్ట్రంలోని జరుగుతున్న అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటీషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్, జస్టీస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో మణిపుర్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు కొన్ని సానుకూల సలహాలు, సూచనలు మంగళవారం లోపల అందిచండని.. అక్కడ జరుగుతున్న హింస కట్టడిపై పిటిషన్లు దాఖలు చేసిన పలు వర్గాలకు సూచించింది. అందించిన సలహాలను కేంద్ర ప్రభుత్వంతో సహా మణిపుర్ ప్రభుత్వం పరిశీలించాలని సూచిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా మే నెల మొదటి వారంలో మణిపుర్‌లో మెజారిటీగా ఉన్న మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడంతో గిరిజన తెగలు అడ్డుకోగా.. అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..