Supreme Court: ‘ప్రార్థనా స్థలాల్లో సర్వే చేపట్టరాదు..’ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

|

Dec 12, 2024 | 9:25 PM

దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court: ప్రార్థనా స్థలాల్లో సర్వే చేపట్టరాదు..  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court
Follow us on

ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం లోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు , మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త కేసులను విచారణకు స్వీకరించరాదని దేశం లోని అన్ని కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 1991 ప్రార్థనాస్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో కీలకవాదనలు జరిగాయి. చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సంజ‌య్ కుమార్‌, కేవీ విశ్వ‌నాథ‌న్‌లతో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. మతపరమైన అంశాల్లో ఆదేశాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విష‌యంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాల‌ను హిందువుల త‌ర‌పున వాదిస్తున్న అనేక మంది లాయ‌ర్లు వ్యతిరేకించారు. త‌మ వాద‌న‌లు విన‌కుండా ఆదేశాలు ఇవ్వొద్దు అని కోరారు. ప్రార్థనా స్థలాల అంశంపై నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్నవాళ్లకు మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది. అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రార్థనా స్థలాల చట్టం లోని 2,3, 4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్‌ వేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని సంబాల్‌ జామా మసీదులో సర్వే వివాదం, మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి