Supreme Court: సోషల్ మీడియాలో ఆధార్ వెరిఫికేషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. మైనర్లకు నో ఎంట్రీ..?
అశ్లీల ఆన్‌లైన్ కంటెంట్‌ను మైనర్లు యాక్సెస్ చేస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లకి ప్రవేశం లేకుండా ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ సిస్టం ప్రవేశపెట్టాలని సూచించింది. ఇలాంటి వ్యవస్థ కోసం ఒక నియంత్రణ సంస్థ అవసరమని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.

Social Media: రకరకాల సోషల్ మీడియా యాప్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. దీంతో యువత వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. 24 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటూ తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు ప్రభావితమై అనేక చెడు పనులకు కూడా పాల్పడుతున్నారు. చిన్న వయస్సులోనే సోషల్ మీడియాకు బానిసలుగా మారడం ద్వారా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మైనర్లకు సోషల్ మీడియాలో యాక్సెస్ లేకుండా చాలా దేశాలు నిషేధం విధిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధంచగా.. మరికొన్ని దేశాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇండియాలో కూడా సోషల్ మీడియాలోకి మైనర్లకు అనుమతి లేకుండా నిబంధనలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లు అనుచిత ఆన్‌లైన్ కంటెంట్ వినియోగించకుండా ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ చేయాలని సూచించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య గుర్చి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఓ కేసులో ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. మైనర్లు అశ్లీల ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోకి మైనర్లకు కూడా అనుమతి ఉంది. సోషల్ మీడియా యాప్స్ వయస్సు ధృవీకరణ చేయడానికి సరైన డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా సోషల్ మీడియా వాడటానికి అనుమతి ఇస్తున్నాయి. వయస్సును తప్పుగా ఎంటర్ చేసి మైనర్లు సోషల్ మీడియాలోకి ఎంట్రీ అవుతున్నారు.
మైనర్లు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్‌ను కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. దీంతో ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ వ్యవస్థను సోషల్ మీడియాలో తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హాస్యనటులు, పాడ్‌కాస్టర్లు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి బలమైన ఒక నియంత్రణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. ప్రాథమిక హక్కులను సమతుల్యం చేయడానికి, ముఖ్యంగా వికలాంగులను కించపరిచే ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలు అవసరమని స్పష్టం చేసింది.




