బ్రేకింగ్: రాఫెల్ డీల్‌పై కేంద్రానికి ఊరట

| Edited By:

Nov 14, 2019 | 11:36 AM

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ డీల్ సక్రమమేనంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టేను నిరాకరించింది. దీనిపై సీబీఐ విచారణ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా.. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ […]

బ్రేకింగ్: రాఫెల్ డీల్‌పై కేంద్రానికి ఊరట
Follow us on

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ డీల్ సక్రమమేనంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టేను నిరాకరించింది. దీనిపై సీబీఐ విచారణ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా.. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ కేసుకు సంబంధించి మోదీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తానికి రాఫెల్ విమానాల కొనుగోలులో కేంద్రానికి ఊరట లభించినట్లే.