పండుగల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం : సుప్రీంకోర్టు

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 2:49 PM

పండుగలు జరుపుకోవడం ముఖ్యమేనని, అయితే పండుగల కంటే ప్రజల జీవితాలు ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది..

పండుగల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం : సుప్రీంకోర్టు
Follow us on

పండుగలు జరుపుకోవడం ముఖ్యమేనని, అయితే పండుగల కంటే ప్రజల జీవితాలు ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఈ వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రస్తుతం మనం కరోనా వైరస్‌తో పోరాడుతున్నామని, ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం మన కనీస బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది.. మన సంప్రదాయంలో పండుగలు ప్రధానమైనవన్న సంగతి తెలుసని, అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీ.వై. చంద్రచూడ్‌ అన్నారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని తెలిపారాయన! బాణాసంచాపై నిషేధం విధించాలంటూ పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్నితోసిపుచ్చింది.