Covid-19: వారికి చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

|

Mar 04, 2021 | 3:09 PM

Supreme Court directs private hospitals: కరోనావైరస్ లాక్‌డౌన్ నాటినుంచి దేశంలో పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధుల పరిస్థితి..

Covid-19: వారికి చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court
Follow us on

Supreme Court directs private hospitals: కరోనావైరస్ లాక్‌డౌన్ నాటినుంచి దేశంలో పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులకు ప్రభుత్వ వైద్య సంస్థలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం, చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు 2020 ఆగస్టు 4న న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ఎస్ రెడ్డిల ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సవరిస్తూ పలు సూచనలు చేసింది. అంతకుముందు కరోనా బారిన పడే అవకాశం ఉన్న వృద్ధులకు చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఆదేశించింది. దీంతో ఆ ఆదేశాలను సవరిస్తూ సుప్రీం నిర్ణయాన్ని వెలువరించింది.

అయితే.. ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ముందస్తు ఆదేశాలను అనుసరించి.. ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల గురించి ఒడిశా, పంజాబ్ మినహా మరే ఇతర రాష్ట్రం వివరాలు ఇవ్వలేదని పిటీషనర్ సీనియర్ న్యాయవాది అశ్వని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రాలు తాజా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని పిటీషనర్ ధర్మాసనానికి వివరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. మహమ్మారి వేళ వృద్ధులకు మరింత రక్షణ అవసరమని.. కానీ రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం పై విధంగా పేర్కొంటూ.. తాజా సూచనలపై స్పందించడానికి అన్ని రాష్ట్రాలకు మూడు వారాల సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే… అర్హత ఉన్న వృద్ధులందరికీ క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లించాలని, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలు వారికి అవసరమైన మందులు, మాస్కులు, శానిటైజర్లు ఇతర అవసరమైన వస్తువులను అందించాలని ఉన్నత న్యాయస్థానం గత సంవత్సరం ఆదేశించింది. కరోనా నేపథ్ంయలో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారు ఫిర్యాదు చేస్తే ఆసుపత్రి పరిపాలన తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో సూచించింది.

Also Read:

Covaxin: భారత్ బయోటెక్ ‘కొవాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. మొత్తం ఎంతమందిపై జరిపారంటే..?

West Bengal Election 2021: ప్రధాని ఫొటోలను 72 గంటల్లో తొలగించండి.. ఎన్నికల సంఘం ఆదేశాలు.. ఎందుకంటే..?