Supreme Court: ఆధార్‌ను ఐడీ ప్రూఫ్‌గా ఆమోదించాల్సిందే.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు!

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్‌ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రీయ జనతాదళ్, ఏఐఎంఐఎం ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈసీకి ఈ ఆదేశాలను జారీ చేసింది.

Supreme Court: ఆధార్‌ను ఐడీ ప్రూఫ్‌గా ఆమోదించాల్సిందే.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు!
Supreme Court

Updated on: Sep 08, 2025 | 9:43 PM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్‌ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పౌరసత్వానికి మాత్రం ఆధార్‌ ధ్రువీకరణ కాదని కోర్టు స్పష్టం చేసింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఎన్నికల కమిషన్‌ సదరు ఆధార్‌ సరైనదేనా లేదా అనేది తనిఖీ చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్‌, ఏఐఎంఐఎం, ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీల ధర్మాసనం ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఓటర్ల జాబితాలో చేర్చడానికి లేదా మినహాయించడానికి ఆధార్‌ను కూడా కమిషన్‌ ప్రకటించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. ఈ నిర్ణయం 1950 నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకొన్నట్టు కోర్టు తెలిపింది. ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది ఇప్పటికే పత్రాలను సమర్పించారని, ఇప్పుడు ఆధార్‌ను చేర్చాలని కోరడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.