AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-PG: వైద్యుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా.. మెడికల్ సీట్లు ఖాళీలపై కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం..

వైద్యుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

NEET-PG: వైద్యుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా.. మెడికల్ సీట్లు ఖాళీలపై కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం..
Supreme Court
Sanjay Kasula
|

Updated on: Jun 08, 2022 | 2:38 PM

Share

మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వైద్యుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. నీట్-పీజీ 2021-22కి సంబంధించి ఖాళీగా 1,456 మెడికల్ పీజీ సీట్ల కోసం ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఏడుగురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఎమ్‌ఆర్‌ షా, అనిరుద్ద బోస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిగిపింది. ఈ సందర్భంగా సీట్లు పూర్తిగా భ‌ర్తీ కాక‌పోతే మాప్‌ఆప్‌ రౌండ్ కౌన్సెలింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్ర‌శ్నించింది. ఒక్క మెడికల్‌ సీటు ఖాళీగా ఉన్నా దానిని భర్తీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

దేశానికి వైద్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు చాలా అవసరమని గుర్తు చేసింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా వారి జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకున్నందుకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ ఇస్తామంటూ హెచ్చరించింది. మిగిలిపోయిన సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ 24 గంటల్లో కేంద్రం, మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ (MCC) అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ గురువారం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్