Tihar Prisons: పోతే ఈ జైలుకే పోవాలి.. తీహార్ జైల్లో ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు!

ఎండకాలం వచ్చిందటే చాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడి పోతుంటారు. ఉక్కబోత నుంచి ఉపసమనం కోసం ఏసీలు, కూలర్లును వినియోగిస్తుంటారు. మనకంటే ఏ కండిషన్స్‌ ఉండవు కాబట్టి ఏమైనా తెచ్చుకోవచ్చు. కానీ జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?. మనం దాని గురించి ఆలోచించకున్నా ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు మాత్రం ఆలోచించారు. జైల్లోని ఖైదీలు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారంట. అవేంటో ఓ లుక్కేదామా?

Tihar Prisons: పోతే ఈ జైలుకే పోవాలి.. తీహార్ జైల్లో ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు!
Tihar Jail

Edited By:

Updated on: Apr 10, 2025 | 3:15 PM

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. వడ గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే తీహార్ జైల్లో ఉండే ఖైదీలు ఎండ తాపాన్ని తట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలో ఖైదీలను చల్లగా ఉంచేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా ఖైదీలకు రోజుకు రెండు నిమ్మకాయలు ఇవ్వడం..వేడి-నిరోధక షీట్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు.

జైలు మాన్యువల్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలల పాటు ప్రతి ఖైదీకి రోజూ రెండు నిమ్మకాయలు అందిస్తారు. వీటితో పాటు (ORS) కూడా ఇస్తారు. ఇవి వారి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడుతాయి. ఇవే కాకుండా ఖైదీలు ఉండే సెల్స్‌లో వేడి-నిరోధక షీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి ఉష్ణోగ్రతను కొన్ని డిగ్రీల మేర తగ్గించడంతో పాటు గది ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.కేవలం వేసవిలోనే కాదు..శీతాకాలంలోనూ ఖైదీల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు.

తీహార్ జైల్లో జైలు మాన్యువల్‌ను అధికారులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జైలు లోపల ఏ ఖైదీలను ప్రత్యేకంగా చూడరు. ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. జైల్లోని 60 ఏళ్లు పైబడిన ఖైదీలను ప్రతిరోజూ వైద్యులు పరిశీలిస్తారు. జైలు లోపల వాటర్ కూలర్లు ఉండవు. ఖైదీలు అవసరమైతే క్యాంటీన్ నుండి చల్లని నీటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. వైద్యులు, లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఖైదీలకు చల్లని లేదా వేడి నీరు ఇవ్వబడుతుంది.

దేశంలోనే అతిపెద్ద జైలు…

1958లో స్థాపించబడిన ఈ తిహార్ జైలే ఇండియాలోని అన్నింటికంటే అతిపెద్దది. ఈ జైలు సుమారు 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ జైలు సముదాయంలో 9 క్రియాత్మక జైళ్లు ఉన్నాయి. వీటితో పాటు రోహిణిలో ఒక జైలు , మండోలిలో ఆరు జైళ్లు ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలో ఉన్న ఈ తీహార్ జైలు, తిలక్ నగర్ ,హరినగర్ ప్రాంతాలకు సమీపంలో ఉంది. 10,025 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంలో నిర్మించిన ఈ జైల్లో ప్రస్తుతం 19,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. దీంతో తీహార్ జైళ్లలో తీవ్రమైన రద్దీ సమస్య ఏర్పడింది. తీహార్ జైల్లో ఉన్న మొత్తం 16 జైళ్లలో, జైలు నంబర్ 6, జైలు నంబర్ 16 మహిళా ఖైదీల కోసం కేటాయించారు. లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలు నంబర్ 6 లో గడిపారు.

తీహార్‌ జైల్లోని జైళ్ల సామర్థ్యం, జైళ్లలోని ఖైదీల సంఖ్యను చూసుకుంటే..

జైలు నంబర్ 1 సామర్థ్యం 565 ఉండగా ఆ జైల్లో ప్రస్తుతం 2,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 2 సామర్థ్యం 455 ఉండగా ప్రస్తుతం 600 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 3 సామర్థ్యం 740 ఉండగా ప్రస్తుతం 2,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 4 సామర్థ్యం 740 ఉండగా ప్రస్తుతం 3,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 5 సామర్థ్యం 750 ఉండగా ప్రస్తుతం 1,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 6 (మహిళలు): సామర్థ్యం 400, ప్రస్తుతం 500 మందికి పైగా మహిళా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 7 సామర్థ్యం 350 ఉండగా ప్రస్తుతం 500 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 8 సామర్థ్యం 600 ఉండగా ప్రస్తుతం 1,100 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 9 సామర్థ్యం 600 ఉండగా ప్రస్తుతం 900 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 10 (రోహిణి) సామర్థ్యం 1,050 ఉండగా ప్రస్తుతం 2,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 11 సామర్థ్యం 700 ఉండగా ప్రస్తుతం 800 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 12 సామర్థ్యం 980 ఉండగా ప్రస్తుతం 1,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 13 సామర్థ్యం 980 ఉండగా ప్రస్తుతం 1,300 మందికి పైగా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 14 సామర్థ్యం 588 ఉందా ప్రస్తుతం 300 మంది ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 15 సామర్థ్యం 248 ఉండగా ప్రస్తుతం 108 మంది ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 16 (మహిళలు) సామర్థ్యం 280 ఉండగా ప్రస్తుతం 200 మంది మహిళా ఖైదీలు ఉన్నారు

జైలు నంబర్ 6లో 22 మంది పిల్లలు, జైలు నంబర్ 16లో 8 మంది పిల్లలు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..