CM KCR : పూరీ జగన్నాథుడి చెంత సీఎం కేసీఆర్‌కు.. సుదర్శన్ పట్నాయక్ ‘సైకత’ శుభాకాంక్షలు

CM KCR Birthday Celebrations: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ(Telangana) లో మాత్రమే కాదు.. వివిధ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ జన్మదినం..

CM KCR : పూరీ జగన్నాథుడి చెంత సీఎం కేసీఆర్‌కు.. సుదర్శన్ పట్నాయక్ సైకత శుభాకాంక్షలు
Cm Kcr Birthday

Updated on: Feb 16, 2022 | 6:24 PM

CM KCR Birthday Celebrations: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ(Telangana) లో మాత్రమే కాదు.. వివిధ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు   ప్రముఖ సైకత శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్. ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత, పూరీ బీచ్ వ‌ద్ద‌ సీఎం కేసీఆర్ భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. సీఎం కేసీఆర్ చిత్ర పటాన్న ఇసుకతో సుందరంగా తీర్చిదిద్దారు.. ఆ ఫోటోకి  The Fighter, Administrator & The Visionary ( పోరాట యోధుడు, పరిపాలకుడు,దూరదృష్టి గల నేత – హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్) అని రాసి  సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్  పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. పూరీ బీచ్ వద్ద ఇసుకనే కాన్వాస్ గా మలిచి ఇసుకతోనే ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా రూపొందించిన సీఎం కేసీఆర్ సైకత చిత్రం పలువురిని ఆకర్షిస్తోంది. బీచ్ వద్దకు వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు సైతం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సుదర్శన్ పట్నాయక్ ఈ సైకత శిల్పాన్ని సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో  రూపొందించారు. కాగా ఇప్పటి వరకూ సుదర్శన్.. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సన్నివేశాలను, ఎందరో వీరులను, సెలబ్రెటీలు సైకత శిల్పాలుగా మలిచారు. కాగా సుదర్శన్ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రుల్లో ఒక్క ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్  సైకత శిల్పాన్ని మాత్రమే రూపొందించారు. తాజాగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రుల్లో రెండవ వ్యక్తిగా నిలిచారు.

Also Read :

 తగ్గేదే లే అంటూ కదురదు.. తప్పు చేస్తే చిప్ప కూడే.. లాలూ నుంచి చౌతాలా వరకు..

శ్రీ‌వారి ఆజ్ఞతోనే అంజ‌నాద్రిలో భూమిపూజ.. వివాదాలు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని సూచన..