
అమెరికాలో స్థిరపడాలనుకునే ఇతర దేశస్థులు గ్రీన్ కార్డు ఎదురు చూస్తు ఉంటారు. అక్కడ పౌరసత్వాని తొలి మెట్టుగా భావించే ఈ గ్రాన్ కార్డు కోసం.. ప్రవాస భారతీయ ఉద్యోగులే దాదాపు 10.5 లక్షల మంది ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే అందులో కూడా దాదాపు 4 లక్షల మందికి గ్రీన్ కార్డు జీవిత కాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాటో అనే సంస్థకు చెందిన డేవిడ్ జే బయర్ జరిపినటువంటి అధ్యనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ ఏడాది నాటికే అమెరికాలోని ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం దాదాపు 18 లక్షల మంది వేచి చూస్తున్నారు. అయితే అందులో 10 లక్షల 50 వేలకి పైగా భారతీయులు ఉన్నారు. ఇక చైనా నుంచి చూసుకుంటే అందులో 2.5 లక్షల వేచి ఉన్నారు. విదేశాల నుంచి వలస వచ్చినవారు అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు ఇచ్చేటటువంటి ఈ గ్రీన్ కార్డుపై దేశాల వారిగా పరిమతి ఉంది. అయితే ఇది రావడానికి సంవత్సరాలు పడుతుంది.
ఇక ప్రతీ ఏడాది జారీ చేసేటటువంటి గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతానికి మించి ఇచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల 10.5 లక్షల మంది ఇండియన్స్‌కు రావాలంటే ఎంత ఆలస్యం అవుతుందో అర్థమవుతుంది. ఇక కొత్తగా దరఖాస్తు చేయాలనుకునేవారు మాత్రం జీవిత కాలం కంటే ఎక్కువగా ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం జీవిత కాలం వరకు ఎదురుచూసినా కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ ఏడాది మార్చి నెల నాటికి చూసుకుంటే 80,324 మంది ఉద్యోగులకు చెందిన గ్రీన్ కార్డుల పిటిషన్లు వలస విభాగంలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే వాళ్ల భార్యా పిల్లలతో కలిపి చూస్తే మొత్తంగా అవి.. 1,72,635 వరకు ఉన్నాయి. అలాగే మరో 13 లక్షల మంది దరఖాస్తులు ఎదురుచూస్తున్న వారి జాబితాలో ఉన్నాయి. ఇలా చాలావరకు అన్ని పెండింగ్‌లో ఉండటంతో ఎప్పుడు వస్తాయే తెలియని పరిస్థితి ఉంది.
ఇక విదేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో చూసుకుంటే ఉద్యోగ ఆధారితి గ్రీన్ కార్డు అప్లికేషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. 1,23,234 శాశ్వత కార్మిక ధ్రువీకరణ పత్రం అప్లికేషన్లు అమెరికా ఆమోదం కోసం వేచి ఉన్నాయి. అయితే ఇవి కూడా గ్రన్ కార్డు వరుసలో ఉన్నట్లే. ఇక గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌లో 50 శాతం ఈబీ-2కు చెందినవే ఉన్నాయి. అలాగే అమెరికా బిజినెస్‌లకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ అత్యున్నత డిగ్రీలు కలిగి ఉన్నవారిని ఈ కేటగిరి కింద పరిగణిస్తారు. ఇక డిగ్రీ పూర్తి చేసి అమెరికాలో జాబ్ చేస్తున్న వారిలో ఈబీ-3 కేటగిరి కింద పరిగణిస్తారు. అయితే ఇవి 19 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నాయి. బీ-2, ఈబీ-3 కింద చూసుకుంటే కొత్తగా అప్లై చేసుకున్న ఇండియన్స్ 134 సంవత్సరాల వరకు ఎదురు చూడాలి. మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 4 లక్షల 24 వేల మంది తమ జీవిత కాలంలో గ్రీన్‌కార్డును చూసే అవకాశం ఉండదు. అందులో 90 శాతం భారతీయులే ఉండటం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..