Traffic Problem: ఓరి నాయనో.. ఆ నగరంలో ట్రాఫిక్ వల్ల ఎంత నష్టం వస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సందే

దేశంలో ఐటీ హబ్ అంటే గుర్తుకు వచ్చేది బెంగళూరు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ అక్కడ ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా ఉంటుంది. ట్రాఫిక్‌ను దాటుకొని గమ్యస్థానాలకు చేరాలంటే రోడ్లపై కొన్నిగంటల పాటు వేచి చూడాల్సిందే. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ఇక ఆ ట్రాఫిక్ సమస్య మాటల్లో చెప్పలేనిది.

Traffic Problem: ఓరి నాయనో.. ఆ నగరంలో ట్రాఫిక్ వల్ల ఎంత నష్టం వస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సందే
Bengaluru Traffic

Updated on: Aug 07, 2023 | 3:45 PM

దేశంలో ఐటీ హబ్ అంటే గుర్తుకు వచ్చేది బెంగళూరు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ అక్కడ ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా ఉంటుంది. ట్రాఫిక్‌ను దాటుకొని గమ్యస్థానాలకు చేరాలంటే రోడ్లపై కొన్నిగంటల పాటు వేచి చూడాల్సిందే. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ఇక ఆ ట్రాఫిక్ సమస్య మాటల్లో చెప్పలేనిది. బెంగళూరులో ఉంటున్న చాలామంది నెటీజన్లు ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం తాము ఎదుర్కొనే అనుభవాలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇలా ట్రాఫిక్ అంతరాయాలు ఉండటం.. సిగ్నళ్ల వద్ద ఎక్కవ సేపు వేచి చూడటం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఇంధనం కూడా వృథా అవుతోంది. దీనివల్ల బెంగళూరు నగరానికి ప్రతి సంవత్సరం 19,725 కోట్లు నష్టం జరుగుతోంది. ట్రాఫిక్ నిపుణులు అయిన ఎంఎన్ శ్రీహరి.. అలాగే ఆయన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.

అలాగే రోడ్డు ప్రణాళిక , ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌళిక సదుపాయల లోటు వంటి అంశాలను మొత్తం పరిశీలించిన తర్వాత ఆ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు పూర్తిస్థాయిలో పనిచేసే ఫ్లైఓవర్లు 60 ఉన్నాయి. అయినప్పటికీ కూడా బెంగళూరు నగరం ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు భారీగా నష్టపోతున్నట్లు ఈ బృందం వెల్లడించింది. అలాగే ఐటీ రంగంలోని వృద్ధి వల్ల బెంగళూరులో ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని.. వాటివల్ల ఇతర సౌకర్యాలు కూడా మెరుగుపడుతున్నాయని పేర్కొంది. అలాగే ప్రస్తుతం భారీగా పెరిగిన జనాభాకు తగ్గట్లుగా అక్కడ వాహనాల సంఖ్య కూడా ఒక కోటీ 50 లక్షలకు దగ్గర్లో ఉంది. కానీ దానికి తగ్గట్లుగా ఆ నగరంలో రోడ్ల విస్తరణ లేదని.. ఆ బృందం తెలిపింది. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటూ వేగంగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మౌళిక సదుపాయల కల్పన సరిపోవడం లేదని.. ఈ వ్యత్యాసమే ట్రాఫిక్ అంతరాయాలకు ముఖ్య కారణమవుతోంది తెలిపింది.

ఇదిలా ఉండగా ఇటీవలే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యల గురించి వివరించారు. ఆ అంతరాలను తొలగించేందుకు వీలుగా దానికి సంబంధించి వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని.. కేంద్రమంత్రి శివ కుమార్‌కు సూచించారు. అయితే ఈ క్రమంలోనే శ్రీహరి బృందం ట్రాఫిక్ నిర్హహణ.. రోడ్డు ప్రణాళికలపై నివేదిక ఇచ్చింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, కర్ణాటక ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..