చెట్ల మీదే ఆన్ లైన్ తరగతులకు హాజరు.. మహారాష్ట్రలోని గ్రామాల్లో విద్యార్థుల అవస్థలు ..ఎప్పుడు మారేను ఈ స్థితి..?

| Edited By: Anil kumar poka

Jul 03, 2021 | 8:43 PM

మహారాష్ట్ర లోని పలుగ్రామాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్హులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ తరగతులకు హాజరు విషయంలో వీరి బాధలు వర్ణనాతీతం.. గోండియా జిల్లాలోని పలు గ్రామాల్లో వీరి పరిస్థితి దయనీయంగా ఉంది.

చెట్ల మీదే ఆన్ లైన్ తరగతులకు హాజరు.. మహారాష్ట్రలోని గ్రామాల్లో విద్యార్థుల అవస్థలు ..ఎప్పుడు మారేను ఈ స్థితి..?
Students Climb Net Work Tree For Online Classes In Maharashtra Villages.2
Follow us on

మహారాష్ట్ర లోని పలుగ్రామాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్హులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ తరగతులకు హాజరు విషయంలో వీరి బాధలు వర్ణనాతీతం.. గోండియా జిల్లాలోని పలు గ్రామాల్లో వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకే ఒక మొబైల్ నెట్ వర్క్ ఉన్నప్పటికీ .. వీరు సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోని చెట్లు ఎక్కి.. ఆన్ లైన్ తరగతులకు అటెండ్ అవుతున్నారంటే నమ్మలేం. కానీ ఇందుకు ఆ చెట్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చేతిలో మొబైల్, పెన్నులు, చెవులకు హెడ్ ఫోన్లత్జో స్టూడెంట్స్ చెట్లు ఎక్కుతుంటే నిరక్షరాస్యులైన గ్రామీణులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ వృక్షాలే తమకు సరైన నెట్ వర్క్ ని అందిస్తున్నాయని విద్యార్థుల్లో కొందరు పేర్కొన్నారు. ఇళ్లలో సరైన సౌకర్యం లేకనో.. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్లనో పేద విద్యార్థులు సుమారు 18 కిలోమీటర్ల దూరం కూడా నడిచి తమకు అనువైన ప్రాంతాలకు చేరుకుంటున్నారంటే అది ఈ దేశ దౌర్భాగ్యాన్నీ ప్రతిబింబిస్తోందని అంటున్నారు.

15 నెలలుగా సుమారు 150 మంది స్టూడెంట్స్ ఇలా చెట్టును పుట్టను పట్టుకుని తమ ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారట.. ఒక్కోసారి రాత్రి 8 లేదా ఎనిమిదిన్నర గంటలు కూడా అయిపోతుందని, చీకట్లో టార్చి లైట్లు పట్టుకుని ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని కొందరు విద్యార్థులు చెప్పారు. ఒక్క గోండియా జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో ఈ విధమైన పరిస్థితి ఉందట.మరి-ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:టోక్యో ఒలింపిక్స్‌ పోటీలకు స్విమ్మర్ గా ఎంపికై రికార్డ్ సృష్టించిన తొలి భారత మానా పటేల్ :Tokyo Olympics 2021.

భూమిపైకి పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎన్ని వచ్చాయో తెలుసా?శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో వెల్లడి..:asteroids on Earth video.

టీకా కోసం తోపులాట…అంత రచ్చ రచ్చ..ఇలాఐతే థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైన వస్తాయంటూ కామెంట్లు:vaccine centre video.

ఆరోగ్యానికి ఔషధం లా తెల్ల మిరియాలు..! నల్ల వాటికంటే కంటే తెల్ల మిరియాలు ద్వారానే ఎన్నో లాభాలు..:White Pepper video.