
Uttarakhand schools re-open: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు 8 నెలల తరువాత విద్యాసంస్థలు తెరుచుకోగా.. చాలా తక్కువ మంది విద్యార్థులు అంటెండ్ అయ్యారు. అయితే స్కూళ్లకు వెళ్లిన విద్యార్థుల్లో ఇప్పుడు పాజిటివ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. ఏపీలోనూ పలువురు విద్యార్థులు, సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఉత్తరాఖండ్‌లో ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. (యాక్సిడెంట్‌కి గురైన సింగర్ విజయ్ ఏసుదాస్)
రాణిఖేట్‌లోని ఓ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడితో పాటు కాంటాక్ట్ అయిన 12 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ స్కూల్‌ని మూడు రోజుల పాటు మూసేసినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థి చికిత్స తీసుకుంటుండగా.. కాంటాక్ట్ అయిన వారి శాంపిల్స్‌ని టెస్ట్‌కి పంపారు. ( ఘనంగా సుధా కొంగర తనయ వివాహం.. హాజరైన మణిరత్నం, సూర్య)