Viral Video: రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం.. సాహసం చేసిన డెలివరీ బాయ్

|

Sep 28, 2023 | 6:52 PM

ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణం వల్ల కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, ఆ తర్వాత ఆదివారం అలాగే సోమవారం రోజున గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు 5 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు ఈ ఐదురోజులను ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరులో రహదారులన్నీ మొత్తం రద్దీగా అయిపోయాయి. అలాగే కిలోమీటర్ల మేర బారులుతీరినటువంటి వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Viral Video: రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం.. సాహసం చేసిన డెలివరీ బాయ్
Traffic
Follow us on

లాంగ్ వీకెండ్ కావడం వల్ల బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీనివల్ల గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే ఈ సమయంలో ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేశారు. కానీ భారీగా ట్రాఫిక్ జామ్‌ అయినప్పటికీ కూడా సమయానికి ఆ పిజ్జా ఆర్డర్‌ను డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. అయితే ఈ విషయాన్నీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఆ సదరు వ్యక్తి. ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ఇప్పుడు గమ్యం చేరుకునే పరిస్థితి లేదని భావించి రిషివత్స అనే ఓ వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశాడు. అలాగే అతను ఉన్నటువంటి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేసేలా.. డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ కూడా అంత పెద్ద ట్రాఫిక్ జామ్‌లో అనుకున్న సమయానికి అంటే అర్ధగంటలోనే డెలివరీ చేశాడు. అయితే ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు విశేష స్పందన వస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణం వల్ల కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, ఆ తర్వాత ఆదివారం అలాగే సోమవారం రోజున గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు 5 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు ఈ ఐదురోజులను ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరులో రహదారులన్నీ మొత్తం రద్దీగా అయిపోయాయి. అలాగే కిలోమీటర్ల మేర బారులుతీరినటువంటి వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలు కూడా చాలా వరకు ఆగిపోయాయి. దీంతో వర్షం వల్ల ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. దీనివల్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..