AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అకస్మాత్తుగా కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. తుఫాన్ వేగంతో దూసుకొచ్చిన జలప్రళయం.. వీడియో

సాధారణంగా కాలనీల్లో నీరు వచ్చి ఇళ్లను ముంచెత్తం ఎప్పుడు జరుగుతుంది, భారీగా వర్షాలు కురుస్తేనే, వరదలు సంభవిస్తేనో కానీ జరుగుతుంది. కానీ కేరళలోని కొచ్చిలో మాత్రం ఇవేవి జరగకుండానే ఇళ్లను నీరు ముంచెత్తాయి. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. ఇందుకు కారణం ఏంటంటే.. ఓ వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలడంతో అక్కడ ఈ పరిస్థితి తలెత్తింది.

Watch: అకస్మాత్తుగా కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. తుఫాన్ వేగంతో దూసుకొచ్చిన జలప్రళయం.. వీడియో
Kochi Water Tank Collapse
Anand T
|

Updated on: Nov 10, 2025 | 12:46 PM

Share

వాటర్‌ ట్యాంక్ కూలి.. సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు ఇళ్లను ముంచెత్తిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఎర్నాకుళం జిల్లా కొచ్చి సమీపంలోని తమ్మనం ప్రాంతంలో వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది, వాటర్ ట్యాంక్ కూలడంతో సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు తుఫాన్ వేగంతో సమీపంలోని కాలనీల్లో ఉన్న ఇళ్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని జలమయంగా మారిపోయాయి, ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో (స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు చేరడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రాత్రి 2 గంటల సమయంలో కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్‌ హౌస్‌కు చెందిన ట్యాంక్‌లో ఒక భాగం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అకస్మాత్తుగా ఉప్పొంగిన నీటివల్ల అనేక ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు సహా విద్యుత్ పరికరాలు అన్ని నాశనమయ్యాయి. ప్రమాద సమయంలో చాలా మంది నివాసితులు నిద్రలో ఉన్నారు. వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన బురద, శిధిలాలు అనేక ఇళ్లలోకి ప్రవేశించాయి. దీంతో కొంతమంది ఇళ్ల పైకప్పులు కూలిపోగా, పలు వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి.

ఈ ట్యాంక్‌ను సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలిసింది. ఈ ట్యాంక్‌ ద్వారానే కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఈ ట్యాంక్ కూలిపోవడంతో కొచ్చి పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే ట్యాంక్‌ కూలడంతో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.