రష్యాలో చిక్కుకున్న 232 మంది ప్రయాణికులు.. విమానం రాక కోసం ఎదురుచూపులు

|

Jun 07, 2023 | 12:44 PM

నిన్న ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని రష్యాకు దారి మళ్లించిన విష‌యం తెలిసిందే. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో దాన్ని ర‌ష్యాని మ‌గ‌దాన్ విమానాశ్రయంలో మంగ‌ళ‌వారం అత్యవ‌స‌రంగా ల్యాండ్ చేశారు.

రష్యాలో చిక్కుకున్న 232 మంది ప్రయాణికులు.. విమానం రాక కోసం ఎదురుచూపులు
Air India
Follow us on

నిన్న ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని రష్యాకు దారి మళ్లించిన విష‌యం తెలిసిందే. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో దాన్ని ర‌ష్యాని మ‌గ‌దాన్ విమానాశ్రయంలో మంగ‌ళ‌వారం అత్యవ‌స‌రంగా ల్యాండ్ చేశారు. అయితే ఆ విమానంలో ఉన్న 232 మంది ప్రయాణికుల‌ను శాన్‌ఫ్రాన్సిస్కోకు త‌ర‌లించేందుకు ఎయిర్ ఇండియా ఈరోజు ప్రత్యేక విమానాన్ని పంపుతోంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ముంబై నుంచి ఆ విమానం ర‌ష్యాకు వెళ్లనుంది.

అయితే విమానంలోని ప్రయాణికులు మ‌గ‌దాన్ లోనే రాత్రంతా గ‌డిపారు. అయితే అక్కడ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నట్లు పౌర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. ఎయిర్‌లైన్స్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విమానంలో దాదాపు ఆరుగంట‌ల పాటు కూర్చున్న ప్రయాణికులు ఆ త‌ర్వాత ఓ హోట‌ల్ గ‌దిలోకి వెళ్లారు. మాస్కోకు దాదాపు 10వేల కిలోమీట‌ర్ల దూరంలో మ‌గ‌దాన్ ప‌ట్టణం ఉంది. అయితే హోట‌ల్స్ స‌రిపోను లేని కార‌ణంగా ప్రయాణికుల్ని డార్మిట‌రీల్లో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి