Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు

|

May 08, 2023 | 8:04 AM

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ - చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు
Vande Bharat Express
Follow us on

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ – చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ఆ రైలులోని సీ6 కోచ్‌లో 75,76 నంబర్ ఉన్న సీట్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దుర్ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.

అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు రైల్వే రక్షణ దళానికి ఫిర్యాదు చేశారు. 1989 రైల్వే చట్టం ప్రకారం నిందితులపై సెక్షన్ 154 కింద కేసు నమేదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఓ ప్రత్యేక బృందం పని చేస్తున్నట్లు ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. మార్చి నెలలోని వనియాంబడి పట్టణంలోని మైసురుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఓ 21 ఏళ్ల యువకుడు రాళ్లు విసిరినందుకు అతడ్ని అరెస్టు చేశారు. చాలా సందర్భాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి