‘నేను వెళ్లిపోతున్నా.. నువ్వు హ్యాపీగా ఉండు.. పెళ్లి చేసుకో..’ ప్రియుడికి మెసేజ్‌ పెట్టి ప్రేయసి సూసైడ్‌

|

Dec 18, 2024 | 5:09 PM

ఓ యువతి తొందరపాటు నిర్ణయంతో నిండు జీవితాన్ని కాదనుకుంది. ప్రియుడికి చివరి మాటలు వీడియో ద్వారా పంపింది. అనతరం ఇంట్లో అందరూ నిద్రపోయాక తనువు చాలించింది. ఉదయం నాటికి గానీ కుటుంబ సభ్యులు గమనించలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఘటన జరిగిన రోజు రాత్రి యువతి వీడియో సందేశాలు రికార్డు చేసి మృత్యుఒడిని ఆశ్రయించింది..

‘నేను వెళ్లిపోతున్నా.. నువ్వు హ్యాపీగా ఉండు.. పెళ్లి చేసుకో..’ ప్రియుడికి మెసేజ్‌ పెట్టి ప్రేయసి సూసైడ్‌
Gujarat Woman Suicide Case
Follow us on

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 18: ‘నీ సుఖమే నే కోరుకున్నా.. అందుకే నిను వీడి వెళ్తున్నా..’ నంటూ ఓ యువతి ప్రియుడికి వీడియో సందేశం పంపి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

ఇంట్లో గొడవలతో విసిగిపోయానని, తనను క్షమించాలంటూ రాధా ఠాకోర్‌ (27) అనే మహిళ కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. అనంతరం ఆమె తన సోదరి వద్ద ఉంటూ సొంతంగా బ్యూటీ పార్లర్‌ నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఆదివారం రాత్రి ఆమె ఇంటికి తిరిగి వచ్చాక, రాత్రి భోజనం చేసి, అందరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూస్తే ఆమె చనిపోయి ఉండటం కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే రాథా ఫోన్ తనిఖీ చేయగా, ఆమె రికార్డ్ చేసిన వీడియోలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధతో గత కొంత కాలంగా ఓ వ్యక్తి చనువుగా ఉంటున్నాడని, అతని వల్ల రాధ ఆత్మహత్య చేసుకుందని రాధ సోదరి అల్కా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలు రాధా ఠాకోర్‌ ఆత్మహత్యకు గల కారణాలేంటి? అవతలి వ్యక్తికి ఆమె ఎందుకు క్షమాపణ చెప్పింది? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతనికి సంబంధించిన ఓ ఫొటో పంపించాలని అడిగినా అతడు పంపలేదని, 7గంటల లోపు ఫొటో రాకపోతే ఏం జరుగుతుందో చూడు అని ఆమె రికార్డింగ్‌లో పోలీసులు గుర్తించారు. ఆనక మరో వీడియోలో నన్ను క్షమించు. నిన్ను అడగకుండా ఓ తప్పటడుగు వేస్తున్నా. బాధపడొద్దు. జీవితాన్ని ఆస్వాదించు. హాయిగా పెళ్లి చేసుకో.. ఆనందంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. జీవితం పట్ల కలత చెందాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని వీడియోలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.