Live Stage Performance: ఇప్పుడంటే ప్రజల వినోదం కోసం సినిమాలు , టీవీలు వంటి రకరకాల సాధనాలు వచ్చాయి కానీ.. 40, 50 ఏళ్ల క్రితం ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని , మన పురాణాలగురించి వీధి నాటకాలు, యక్షగానాలు వంటి వాటిద్వారా తెలిసేవి. ఇప్పటికీ భారత, భాగవత కథలంటే చెవి కోసుకునే వాళ్ళు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. అయితే గతంలో మహాభారతంలోని పర్వాలన్నిటినీ ‘వీధి నాటక రూపంలో ప్రదర్శించేవారు. అలాంటి ప్రదర్శనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడు లో కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటికి ఆదరణ తగ్గింది.. కానీ తమ కళలపై ఉన్న మక్కువని మరచిపోలేని కళాకారులూ ప్రజల అదరణలతో సంబంధం లేకుండా తమ కళలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలా ఓ కళాకారుడు అర్జున తపస్సు నాటకం వేస్తూ.. గుండెపోటుతో మృతి చెందాడు.. ఈ విషాద ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడులోని వేలూరు జిల్లాలోని అరసంపట్టు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అర్జున తపస్సు నాటకం వేస్తూ.. పద్యాన్ని పాడుతున్న సమయంలో కళాకారుడు కమలనాథన్ గుండెపోటుతో మృతి చెందాడు. కమలనాథన్ వృత్తి రీత్యా ఉపాద్యాయుడు. అయితే కమలనాథన్ కు చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో దీంతో చిన్నతనం నుంచి వీధి నాటకాలు వేస్తున్నారు. తన జీవితంలో చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉన్నారు.. నటనే ఊపిరిగా సాగిన కమల్ నాథన్ జీవితం చివరి క్షణాల్లో కూడా నటిస్తూనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కమల్ మృతి పై తోటి కళాకారులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read:
Yellakonda Shiva Temple: తెలంగాణ శ్రీశైలంగా ఖ్యాతిగాంచిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..(photo story)