30 ఏళ్ల తర్వాత తొలిసారి మొహర్రం.. వెల్లివిరిసిన ఆనందం

|

Jul 28, 2023 | 8:40 AM

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి జమ్మూకశ్వీర్‌లో షియా ముస్లింలు మొహర్రం పండుగ జరుపుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం శ్రీనగర్‌ గుండా లాల్‌ చౌక్‌ ఏరియా మార్గంలో ఊరేగింపు..

30 ఏళ్ల తర్వాత తొలిసారి మొహర్రం.. వెల్లివిరిసిన ఆనందం
Muharram Procession In Kashmir
Follow us on

శ్రీనగర్‌, జులై 28: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి జమ్మూకశ్వీర్‌లో షియా ముస్లింలు మొహర్రం పండుగ జరుపుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం శ్రీనగర్‌ గుండా లాల్‌ చౌక్‌ ఏరియా మార్గంలో ఊరేగింపు సాగింది. గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగిన ఊరేగింపులో వేలాది షియాలు పాల్గొన్నారు.

కాగా 1989 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఊరేగింపులపై నిషేదం కొనసాగుతోంది. మొహర్రం ఊరేగింపు కోసం ప్రతీయేట షియా కమ్యునిటీ అనుమతి అడుతున్నప్పటికీ ఉగ్రవాదం, శాంతిభద్రతల దృష్ట్యా గత 30 ఏళ్లుగా అక్కడ నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు మొహర్రం పండుగ జరుపుకున్నందుకు షియా కమ్యునిటీ ఆనందం వ్యక్తం చేసింది. మూడంచెల భద్రత నడుమ ఊరేగింపు జరిగినట్లు, 34 ఏళ్ల నిషేధం తర్వాత సంప్రదాయ ఊరేగింపు జరగడం ఇదే మొదటిసారని కశ్మీర్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.