Srinagar ASI Martyred: శోకసంద్రంలో ఏఎస్‌ఐ ముస్తాక్‌ అహ్మద్ కుటుంబం.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌..

|

Jul 13, 2022 | 8:56 PM

Srinagar Terrorist Attack: శ్రీనగర్‌లో మంగళవారం ముస్తాక్‌ అహ్మద్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. లాల్ బజార్ ప్రాంతంలో రోడ్డుపై భద్రతా విధులు నిర్వహిస్తున్న అధికారి సహా ముగ్గురు పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో..

Srinagar ASI Martyred: శోకసంద్రంలో ఏఎస్‌ఐ ముస్తాక్‌ అహ్మద్ కుటుంబం.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌..
Kashmir police officer Mushtaq Ahmed
Follow us on

Kashmir Police Officer Mushtaq Ahmed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల తూటాలకు బలైన ఎస్‌ఐ ముస్తాక్‌ అహ్మద్‌ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. శ్రీనగర్‌లో మంగళవారం ముస్తాక్‌ అహ్మద్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. లాల్ బజార్ ప్రాంతంలో రోడ్డుపై భద్రతా విధులు నిర్వహిస్తున్న అధికారి సహా ముగ్గురు పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మృతి చెందిన అధికారిని కుల్గాం నివాసి ఏఎస్ఐ ముస్తాక్ అహ్మద్‌గా గుర్తించారు. ఆయన మృతి చెందిన వార్త తెలియగానే కుటుంబసభ్యులతో పాటు గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముస్తాక్‌ మృతదేహంపై ఆయన బంధువులు పడి రోదించడం అక్కడున్న వాళ్లకు కంటతడి పెట్టించింది ముస్తాక్‌ అహ్మద్‌ను చంపిన ఉగ్రవాదులకు కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.  

శ్రీనగర్‌లోని లాల్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లో చేరేందుకు ఏఎస్‌ఐ ముస్తాక్‌ అహ్మద్‌ ఆదివారం కుటుంబంతో కలిసి ఈద్‌ జరుపుకుని సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరారు. కొన్ని గంటల తర్వాత, భయంకరమైన గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ, ISIS, దాని మీడియా ఫోర్స్ AMAQ ద్వారా ఈ దాడికి బాధ్యత వహించింది.

శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏఎస్ఐ..

ఈ దాడిని ఉగ్రవాదులు కెమెరాలో రికార్డు చేశారు. ఏకే-47 చిత్రంతో కూడిన వీడియోను వారు విడుదల చేశారు. ఈ దాడిలో పోలీసుల నుంచి ఏకే-47లను లాక్కున్నట్లు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఐఎస్ఐఎస్ విడుదల చేసిన వీడియోలో గ్రూపులోని 2-3 మంది ఉగ్రవాదులు పిస్టల్స్, ఏకే-47 రైఫిల్స్‌తో మొత్తం దాడికి ఎలా పాల్పడ్డారో వీడియోలో ఉంది. రెండు వైపుల నుంచి దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. గ్లాక్ పిస్టల్ తీసుకొని, టాటా-సుమో వెనుక నుంచి పోలీసులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆపై AK-47 రైఫిల్‌తో మరొక దాడి చేసి.. ఆ వ్యక్తి ముందు నుంచి కాల్పులు జరిపారు.

ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు?

పోలీసులు అక్కడికక్కడే ఉన్న భారీ చెట్టు వెనుక దాక్కోవడానికి ప్రయత్నించగా.. రెండవ టెర్రరిస్టు వెనుక నుంచి వచ్చి మొదట చెట్టు వెనుక ఉన్న పోలీసుపై దాడి చేశాడు. ఆపై కిటికీ అద్దాలు పగలగొట్టి ASI ముస్తాక్ అహ్మద్‌ను హత్య చేశాడు. 2020లో ముస్తాక్ అహ్మద్ చిన్న కుమారుడు అతని ఇంటి నుంచి వెళ్లిపోయి ఉగ్రవాదులతో చేరాడు. ఆకిబ్ ముస్తాక్ అవంతిపూర్‌లోని ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నుంచి బి-టెక్ చదువుతున్న సమయంలో టెర్రిస్టులతో కలిసిపోయాడు. కొద్ది రోజులకే ముస్తాక్ చిన్న కుమారుడు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. 

రెండేళ్ల క్రితం ఉగ్రవాది కొడుకు హతమయ్యాడు

ముష్తాక్ హింసా మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరడానికి ఆకిబ్‌ను తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. కొడుకు చనిపోయి రెండేళ్లయినా ఇప్పుడు ఆ పోలీసు అధికారి తండ్రి స్వయంగా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు.

జాతీయ వార్తల కోసం..