
శ్రీలంక – భారతదేశం మధ్య సంబంధాలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పొరుగు దేశ అధికారులు ఆదివారం(ఫిబ్రవరి 23) శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై 32 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
ఈ విషయం గురించి సమాచారం ఇస్తూ, శ్రీలంక నావికాదళం ఒక ప్రకటన విడుదల చేసింది. మన్నార్‌కు ఉత్తరాన ఉన్న సముద్ర ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఈ వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. “ఐదు భారతీయ ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. 32 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేశారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.
The Sri Lanka Navy has seized 5 Indian fishing boats and arrested 32 Indian fishermen who were poaching in the Sea of Sri Lanka off Mannar.#india #SriLanka #fishermen #bengal
— Pradeep Mehawarnam (@mehawarnam) February 23, 2025
అరెస్టు చేసిన మత్స్యకారులను, వారి పడవలను తలైమన్నార్ పీర్‌కు తీసుకువచ్చామని, చట్టపరమైన చర్యల కోసం వారిని మన్నార్ ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని శ్రీలంక నేవీ తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు నేవీ 131 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేశారు. శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపలు పట్టడంలో పాల్గొన్న 18 పడవలను స్వాధీనం చేసుకుంది.
భారతదేశం – శ్రీలంక మధ్య మత్స్యకారుల సమస్య వివాదాస్పద అంశంగా ఉంది. శ్రీలంక నావికాదళ సిబ్బంది పాక్ జలసంధి ప్రాంతంలో భారత జాలర్లపై కాల్పులు జరిపి, శ్రీలంక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో అనేక సార్లు వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి, శ్రీలంక నావికాదళం 131 మంది మత్స్యకారులను అరెస్టు చేసి, 20 ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. ఈసారి అరెస్టయిన 32 మంది మత్స్యకారులు తమిళనాడుకు చెందినవారుగా భావిస్తున్నారు. తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాలర్లు ఆదివారం సమావేశం నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..