Spicejet: ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వరుస సాంకేతిక సమస్యల కారణంగా ఈ సంస్థ అభాసుపాలవుతోంది. 18 రోజుల్లో 8 సార్లు సాంకేతిక సమస్యలు రావడంతో డీజీసీఏ సీరియస్ అయితన విషయం తెలిసిందే. స్పైస్ జెట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాజాగా మరో సాంకేతిక సమస్య వెలుగులోకి వచ్చింది. తాజాగా దుబాయ్-మధురై మధ్య నడిచే విమానానికి పెను ప్రమాదం తప్పింది.
బోయింగ్ బి737 మ్యాక్స్ విమానం ఫ్రంట్ వీల్ సరిగ్గా పనిచేయకపోవడంతో సోమవారం ఈ విమానం ఆలస్యంగా బయలు దేరింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో గడిచిన 24 రోజుల్లో స్పైస్‌జెట్‌లో తలెత్తిన 9వ సమస్య ఇది. సోమవారం మధురై నుంచి దుబాయ్‌కి వెళ్లిన బోయింగ్ బీ737 విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ వాక్-అరౌండ్ తనిఖీలో భాగంగా ఫ్రంట్ వీల్‌లో లోపాన్ని గుర్తించాడు. దీంతో ముంబై నుంచి మరో విమానాన్ని దుబాయ్‌కి తెప్పించారు. ఈ విషయమై స్పైస్‌జెట్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ.. సోమవారం దుబాయ్ నుంచి మదురై రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా చివరి క్షణంలో ఆలస్యమైంది. వెంటనే ప్రత్యామ్మాయ విమానాన్ని ఏర్పాటు చేసిన ప్రయాణికులను పంపించాం అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే స్పైట్ జెట్‌లో లోపాల పర్వం జూలై 2న మొదలైంది. ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పొగలు వచ్చాయి. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత జూలై 5న బోయింగ్ 737 ఫైటర్ టేకాఫ్ అయిన తర్వాత వెదర్ రాడార్ పనిచేయక తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అనంతరం పలు సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా కేవలం 18 రోజల్లోనే 8 సార్లు ఏదో ఒక సంఘటన జరగడంతో డీజీసీఏ స్పైస్ జెట్‌పై సీరియస్ అయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..