Viral: పైనుంచి చూస్తే చెరుకు తోటే.. లోపలకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.. మాములు సెటప్ కాదుగా

|

Sep 04, 2022 | 7:33 PM

మాంచి స్కెచ్ వేశారు. చెరుకు తోటలో సెటప్ పెట్టారు. అయినప్పటికీ అడ్డంగా బుక్కయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి....

Viral: పైనుంచి చూస్తే చెరుకు తోటే.. లోపలకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.. మాములు సెటప్ కాదుగా
Sugarcane Field (representative image)
Follow us on

Cannabis Crop In Sugarcane Field: మాంచి స్కెచ్ వేశారు. చెరుకు తోటలో సెటప్ పెట్టారు. అయినప్పటికీ అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి ఇప్పుడు ఏ స్థాయిలో దొరుకుతుందో చూస్తూనే ఉన్నాం. ఎజెన్సీ ఏరియాల్లో, మాటుగా ఉండే కొండ ప్రాంతాల్లో చాటుమాటుగా ఈ దిక్కుమాలిన పంటను పండిస్తున్నారు.  ఈ మత్తుకు యువత బాగా అడిక్ట్ అయ్యింది. ఈ క్రమంలో దీన్ని పండించేందుకు, రవాణా చేసేందుకు చాలామంది  మాస్టర్ స్కెచ్చులు వేస్తున్నారు. డబ్బుకు ఆశపడి.. ఈ గలీజ్ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని సాంగ్లీ జిల్లా(Sangli district) మిరాజ్ తాలూకా షిపూర్ గ్రామంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో పెంచిన 400 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంధ్యారాణి దేశ్‌ముఖ్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేసి గుట్టు రట్టు చేసింది. నందకుమార్ బాబర్ అనే రైతును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అతడికి గ్రామ శివారల్లో ఐదెకరాల భూమి ఉంది. అందులో ఒక ఎకరం చెరకు వేశారు. తాను గంజాయి పండించిన సంగతి ఎవరికీ తెలియకూడదని చెరకు మధ్య అంతర పంటగా గంజాయి వేశాడు. కానీ రహస్య సమచారంతో పోలీసులు రైడ్ చేయడంతో బాగోతం బయటపడింది. మీరజ్‌ తాలూకాలో పెద్దఎత్తున గంజాయి పంట దొరికిన తొలి ఆపరేషన్‌ ఇదే.

Ganja

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..