సూపర్ కూల్ న్యూస్ చెప్పిన IMD.. ఈసారి చాలా ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు

|

May 12, 2022 | 7:48 PM

ఈసారి ఎండల నుంచి చాలా ముందుగానే రిలీఫ్ దక్కనుంది. మే మధ్యలోనే నైరుతి రుతు పవనాలు దేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ కూల్ న్యూస్ చెప్పింది.

సూపర్ కూల్ న్యూస్ చెప్పిన IMD.. ఈసారి చాలా ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon
Follow us on

Weather Update: భారత వాతావరణ శాఖ సూపర్ కూల్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం దేశంలోకి నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ఎప్పటికన్నా కాస్త ముందుగానే ఎంట్రీ ఇవ్వనున్నాయి. రుతు పవనాలు ఫస్ట్ అండమాన్​ నికోబార్​ దీవులను తాకుతాయని.. ఈనెల 15న ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మండే ఎండల నుంచి రిలీఫ్ దక్కనుంది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఇది కూల్ న్యూస్ అనే చెప్పాలి. ఇక కేరళలో కూడా ఈసారి రుతుపవనాలు ఎర్లీగానే ఎంట్రీ ఇవ్వనున్నాయి. మాములుగా ప్రతి ఏటా జూన్​ 1న రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడించింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయువ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని తెలిపింది.