మోదీకి సోనియా రిక్వెస్ట్ వీడియో

|

Aug 28, 2020 | 8:19 PM

నీట్, జేఈఈ-2020 ప్రవేశ పరీక్ష అంశం హస్తినలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకోవడం, దీనికి పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే....

మోదీకి సోనియా రిక్వెస్ట్ వీడియో
Follow us on

నీట్, జేఈఈ-2020 ప్రవేశ పరీక్ష అంశం హస్తినలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకోవడం, దీనికి పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి మోదీ సర్కారుకు విజ్ణాపన చేశారు. పరీక్షలు నిర్వహించే విషయంలో విద్యార్థుల వాణి వినాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ మేరకు ఒక వీడియోను సోనియా గాంధీ పోస్ట్ చేశారు. నిమిషం పాటు సాగే ఈ వీడియోకు, ‘స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ’ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఇందులో సోనియా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. ‘మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నా ఆలోచన కూడా మీ చుట్టూనే తిరుగుతోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది చాలా కీలకం. ఇది కేవలం మీకే కాదు, మీ పేరెంట్స్ కు కూడా చాలా ముఖ్యం. మీరే మా ప్యూచర్. మీ భవితే మాకు ముఖ్యం. మెరుగైన భారత్ మీపైనే ఆధారపడి ఉంది’ అని సోనియా ఆ వీడియోలో అన్నారు.